దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేల్కర్ మృతికి సంబంధించి మంగళవారం ఆయన కుటుంబ సభ్యలు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబయిలోని సముద్ర తీర ప్రాంత హోటల్లో ఫిబ్రవరి 22న మోహన్ దేల్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా ప్రదేశంలో దేల్కర్ పేరుతో ఉన్న 15 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ లేఖలో కొందరి పేర్లు ఉన్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.
దాద్రానగర్ హావేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ల్ ఖేడా పటేల్ పేరు ఉన్నట్లు అసెంబ్లీలో హోంమంత్రి తెలిపారు. కేసును ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తామని వెల్లడించారు.
మంగళవారం రోజు సీఎం ఉద్ధవ్ ఠాక్రేని దెల్కర్ భార్య, కుమారుడు అభినవ్ దేల్కర్ కలిశారు. తన తండ్రిని ప్రపుల్ల్ ఖేడా పటేల్ తీవ్రంగా వేధించిండని అభినవ్ దేల్కర్ ఆరోపించారు.
ఇదీ చూడండి: లోక్సభ ఎంపీ మోహన్ ఆత్మహత్య!