ETV Bharat / bharat

'కరోనాపై 'సర్జికల్ స్ట్రైక్' చేయండి' - neat to home vaccination program

కరోనాపై పోరు 'సర్జికల్ స్ట్రైక్​'లా ఉండాలని.. వైరస్​ దరి చేరే వరకు వేచి చూడకూడదని వ్యాఖ్యానించింది బొంబాయి హైకోర్టు. వైరస్​ను ముందుగానే అంతమొందించే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది.

Bombay high court
బొంబే హైకోర్టు
author img

By

Published : Jun 9, 2021, 6:31 PM IST

ప్రస్తుత సమాజానికి అతిపెద్ద శత్రువైన కరోనాపై పోరు 'సర్జికల్​ స్ట్రైక్​'లా ఉండాలని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. వైరస్​ విజృంభించే వరకు వేచి చూడకుండా.. ముందుగానే దానిని అంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. కేంద్ర ప్రభుత్వ 'ఇంటికి సమీపంలో వ్యాక్సినేషన్​' కార్యక్రమం.. వైరస్​ దరి చేరేవరకు వేచి చూస్తున్నట్లు ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ దిపాంకర్​ దత్​, జస్టిస్ జీఎస్​ కులకర్ణితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

"కరోనా వైరస్​ అతిపెద్ద శత్రువు. దానిని నివారించాల్సిన అవసరం ఉంది. వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మీరు(ప్రభుత్వం) సర్జికల్​ స్ట్రైక్​లా వైరస్​పై విరుచుకుపడాలి. మీ దగ్గరకు వచ్చేంత వరకు వేచి చూస్తున్నారు. శత్రువు ప్రదేశంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు."

- జస్టిస్​ దిపాంకర్ దత్​, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ప్రభుత్వ నూతన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ధ్రుతి కపాడియా, కునాల్​ తివారీ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జాప్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఇంటింటికీ వ్యాక్సిన్​ పంపిణీ చేయడం కుదరదని.. ప్రతి ఇంటికి సమీపంలో వ్యాక్సినేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కేరళ, జమ్ముకశ్మీర్​, బిహార్​, ఒడిశా సహా మహారాష్ట్రలోని కొన్ని మున్సిపల్​ కార్పొరేషన్స్​లో ప్రతి ఇంటికీ వ్యాక్సిన్​ పంపిణీ జరుగుతుండగా.. కేంద్రం ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నించింది.

ఇదీ చూడండి: ఈసీ​గా బాధ్యతలు స్వీకరించిన అనూప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.