ETV Bharat / bharat

కార్పెంటర్ ఘాతుకం.. యువతి తల నరికి.. శరీరాన్ని ముక్కలు చేసి..

దిల్లీ శ్రద్ధావాకర్ తరహా మర్డర్ జమ్ముకశ్మీర్​లో జరిగింది. 30 ఏళ్ల యువతిని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమె తల, శరీర భాగాలను నరికేశాడు. బాధితురాలి శరీర భాగాలను వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు, విదేశీ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

carpenter killed a women and chopped her body in budgam jammu and kashmir
మహిళ శరీర భాగాలను నరికి వేరే ప్రాంతాల్లో పడేసిన వ్యక్తి
author img

By

Published : Mar 12, 2023, 3:29 PM IST

దిల్లీ శ్రధ్దావాకర్ తరహా ఘటన జమ్ముకశ్మీర్​లో జరిగింది. బుద్గామ్​లో ఓ వ్యక్తి 30 ఏళ్ల మహిళను దారుణంగా చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు షబీర్ అహ్మద్​ను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మార్చి 7న బాధితురాలు కోచింగ్ క్లాస్​కు వెళ్లింది. ఆ రోజు సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ కనిపించలేదు. మార్చి8న సోయిబగ్​ పోలీస్​ స్టేషన్​లో బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. షబీర్ అహ్మద్, అహ్మద్ అజీజ్​, మరి కొందరు అనుమానితులను తమదైన రీతిలో విచారించారు. దీంతో షబీర్ అహ్మద్​ తానే యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు.

'యువతిని మొహన్​పొరలోని నా ఇంటికి తీసుకెళ్లా. మార్చి 7 అర్ధరాత్రి చంపేశా. హత్య విషయం బయటకు రాకూడదని యువతి తలను నరికేశా. అలాగే శరీర భాగాలను ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాల్లో పడేశాను' అని పోలీసుల దర్యాప్తులో నిందితుడు షబీర్ అహ్మద్ ఒప్పుకున్నాడు. షబీర్​ను తీసుకెళ్లి యువతి శరీర భాగాలను తీసుకొచ్చారు పోలీసులు. బాధితురాలి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షబీర్ అహ్మద్(45) వృత్తిరీత్యా వడ్రంగి అని పోలీసులు తెలిపారు.

విదేశీ మహిళపై అత్యాచారం
మహారాష్ట్ర.. ముంబయిలో దారుణం జరిగింది. విదేశీ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు మనీశ్​ గాంధీపై కోసం గాలిస్తున్నామని తెలిపారు. బాధితురాలు పోలాండ్​కు చెందిన మహిళని వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మనీశ్ గాంధీ 2016 నుంచి 2022 మధ్య కాలంలో విదేశీ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి వ్యక్తిగత ఫొటోలను తీసి బ్లాక్​ మెయిల్ చేసేవాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి పలుసార్లు ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు మనీశ్​పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
మహారాష్ట్రలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్దానా జిల్లాలోని సమృద్ది ఎక్స్​ప్రెస్​వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ​ఈ ప్రమాదం ఆదివారం ఉదయం 8గంటలకు జరిగింది. 13 మందితో ఓ కారు ఔరంగాబాద్ నుంచి షిగావ్​ పైపు అతివేగంతో వెళ్లింది. అదుపు తప్పి రోడ్డు బారికేడ్​ను ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా కొట్టింది. కారులో ఉన్న ఆరుగురు మరణించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.