ETV Bharat / bharat

యువకులపైనుంచి దూసుకెళ్లిన కారు.. ఆగ్రహంతో స్థానికుల విధ్వంసం

author img

By

Published : Mar 19, 2022, 10:39 AM IST

Giridih News: హోలీ రోజు రంగులు జల్లేందుకు ప్రయత్నించిన యువకులపైనుంచి కారు దూసుకెళ్లిన ఘటన జార్ఖండ్​లో జరిగింది. డ్రైవర్ చర్యతో ఆగ్రహించిన స్థానికులు విధ్వంసం సృష్టించారు.

Giridih News
యువకులపైనుంచి దూసుకెళ్లి కారు.. ఆగ్రహంతో స్థానికుల విధ్వంసం

Car rammed youth ఝార్ఖండ్​ గిరీడీహ్​లో హోలీ పండగ రోజు ఓ కారు బీభత్సం సృష్టించింది. కొందరు యువకులు రోడ్డుపై రంగలు చల్లుకునే సమయంలో ఓ వాహనం అటువైపుగా వచ్చింది. దీంతో వారు దాన్ని ఆపి రంగులు జల్లేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా ఆగ్రహించిన డ్రైవర్ కారును యువకులపైనుంచి దూసుకుపోనిచ్చాడు. దీంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ తీరుతో కోపోద్రిక్తులైన స్థానికులు కారును ధ్వంసం చేశారు. అందులో ఉన్న డ్రైవర్​, ప్యాసెంజర్లపై దాడి చేశారు. వెంటనే పోలీసుల రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.

car rammed youth

Jharkhand news

బెంగబాద్​ పోలీస్​ స్టేషన్ పరిధిలోని చోట్కీ ఖార్గడీహా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ యువకుడి పేరు వాసుదేవ్ తూరి అని, అతను వారి బంధువుల ఇంట్లో ఉంటున్నాడని వెల్లడించారు. అతని కాలికి తీవ్ర గాయమైందన్నారు. కారును పోలీస్ స్టేషన్​కు తరలించాడు.

Giridih car news

ఘటన అనంతరం కారు డ్రైవర్, ప్యాసెంజర్లను కాపాడేందుకు ఓ హోటల్​ ఆపరేటర్​ ప్రయత్నించాడని స్థానికులు ఆరోపించారు. దీంతో వారు హోటల్​ వద్ద గొడవకు దిగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు వచ్చి వారిని సముదాయించారు.

ఇదీ చదవండి: ప్రత్యేక ఆకర్షణగా 'ట్రాన్స్​జెండర్​ కేఫ్'​.. కస్టమర్లతో హౌస్​​ఫుల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.