ETV Bharat / bharat

92 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికల బరిలోకి.. - ఆగ్రా జిల్లా పంచాయతీ ఎన్నికలు

ఉత్తర్​ప్రదేశ్​లో జరుగుతున్న జిల్లా పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఆగ్రా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి 90సార్లకుపైగా పోటీ చేశారు. ఇన్నిసార్లు పోటీ చేసినా.. ఒక్కసారీ గెలవలేకపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి వార్డు సభ్యునిగా నామినేషన్​ వేశారు. నిరంతరం పరాజయం పాలవుతున్న ఆయన.. రికార్డు స్థాయి ఓటముల కోసమే ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇంతకీ ఎవరాయన? ఆయన కథేంటి?

Candidate who lost elections over 90 times files for zilla panchayat election
ఎన్నికల్లో ఓటమి కోసం.. అలుపెరగని పోరాట యోధుడు
author img

By

Published : Apr 6, 2021, 2:29 PM IST

ఎన్నికలు అనగానే ఎవరైనా గెలుపు కోసం ప్రయత్నిస్తారు. ఒక్కసారైనా విజయం సాధించకపోతామా అని కోరుకుంటారు. అయితే.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అంబేడ్కరీ హసనురామ్​ మాత్రం అందుకు భిన్నం. ఇప్పటివరకూ 92 సార్లు బరిలోకి దిగిన ఆయన.. ఒక్కసారీ గెలవలేకపోయారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోసారి నామినేషన్​ వేశారు 74ఏళ్ల అంబేడ్కరీ. పైగా ఓటమి కోసమే నామినేషన్​ దాఖలు చేస్తున్నానని చెప్పారు. ఎందుకిలా?

ఆగ్రా జిల్లా ఖైరాగఢ్​కు చెందిన 1947 ఆగస్టు 15న జన్మించిన అంబేడ్కరీ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(మన్రేగా) కింద కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1985 నుంచి ఆయన ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ, ఒక్కసారీ గెలుపు ఆయన ఇంటి తలుపు తట్టలేదు.

Candidate who lost elections over 90 times files for zilla panchayat election
అంబేడ్కరీ హసనురామ్​ (చేతిలో కర్ర ఉన్న వ్యక్తి)

తిరుగుబాటుదారుడిగా..

తొలిసారి ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఓ సైనికుడిలా పోరాడానని అంబేడ్కరీ చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారట. కానీ.. 'మీ భార్యే మిమ్మల్ని సరిగ్గా గుర్తించరు, అలాంటిది మీకెవరు ఓటేస్తారు?' అని స్థానికులు అవమానించారని చెప్పుకొచ్చారాయన. ఈ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన హసను.. ఆ తర్వాత బీఎస్పీని వదిలి 1988లో ఖైరాగఢ్​ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నాటి నుంచి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వచ్చారు.

ఎలాంటి ఖర్చులేకుండా..

ఇప్పటివరకు 92 సార్లు ఓడిన అంబేడ్కరీ.. ఈ విషయంలో శతకానికి చేరువయ్యారు. మరో 7 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. 100 సార్లు పరాజయం పాలైన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాలని కోరుకుంటున్నానని ఆయనే స్వయంగా చెప్పారు. అందుకోసం ఎలాంటి అవకాశాన్ని వదులుకోనన్న ఆయన.. అదే ఉత్సాహంతో ఎలాంటి ఖర్చు లేకుండా ప్రచారం కూడా సాగిస్తానన్నారు.

"విజయం సాధించేందుకు పెద్ద రాజకీయ పార్టీలు భారీ ఎత్తున డబ్బులు వెచ్చిస్తాయి. నేను ఓడిపోవడానికి మాత్రమే పోటీ చేస్తున్నాను. అలాంటప్పుడు బ్యానర్లు, ప్రచార కార్యక్రమాలకు అనవసరమైన ఖర్చులెందుకు? మనం ప్రజల మద్దతు కోరుతూ వారిని అభ్యర్థించాలంతే! నేనిప్పటి వరకు 90దఫాలకుపైగా అన్నిరకాల ఎన్నికల్లో పాల్గొన్నాను. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు."

- అంబేడ్కరీ హసనురామ్

ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సారి సొంత భార్యకు వ్యతిరేకంగా పంచాయతీ బరిలో దిగుతున్నారు అంబేడ్కరీ. అదే వార్డు తరఫున ఆయన సతీమణి శివదేవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భార్యాభర్తల ఎన్నికల పోరుపై స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: ఔరా: కాళ్లతోనే బౌలింగ్​.. బ్యాట్స్​మెన్​ పరేషాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.