గుజరాత్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. వల్సాడ్ జిల్లాలోని ఛత్రవడ గ్రామ ఎన్నికల్లో వార్డ్ నెంబర్ 5 నుంచి సంతోష్ హల్పతి అనే అభ్యర్థి పోటీ చేశాడు. అయితే.. ఆ ఎన్నికల్లో సంతోష్‌కు కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. దీంతో అతడు బోరున విలపించాడు. సంతోష్ ఇంట్లో 12 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ వారికి ఇతర వార్డులో ఓటు హక్కు ఉన్నందున కనీసం రెండు డిజిట్ల ఓట్లు కూడా పొందలేకపోయానని బాధపడ్డాడు. అయితే.. సంతోష్ ప్యానెల్లో అతనొక్కడే ఓడిపోయాడు. అదే వార్డుకు చెందిన గణేష్ పాటిల్ అనే అభ్యర్థి 111 ఓట్లతో గెలుపొందాడు. మరో అభ్యర్థికి 81 ఓట్లు వచ్చాయి.
గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి యోగేష్ పటేల్ 2,733 ఓట్లతో ఆ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. మరో సర్పంచ్ అభ్యర్థి 1,100 ఓట్లు రాబట్టాడు. మరో అభ్యర్థి భవిక్ పటేల్‌కు 228 ఓట్లు వచ్చాయి.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా తీసుకోని ఉద్యోగులకు జీతం కట్!