ETV Bharat / bharat

బంగాల్​: ఏడో దశ ఎన్నికల ప్రచారానికి తెర

బంగాల్​లో ఈ నెల 26న జరగనున్న ఏడో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 34 స్థానాల్లో ఓటింగ్​ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది.

Campaigning ends for the seventh phase of poll in WB
బంగాల్​: ముగిసిన 7దశ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 24, 2021, 6:18 AM IST

బంగాల్​లో ఏడో దఫా ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. 34 అసెంబ్లీ స్థానాల్లో.. ఈ నెల 26న (సోమవారం) ఓటింగ్​ జరగనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న వేళ ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ మేరకు ఓటింగ్​కు మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని ఆయా పార్టీలకు సూచించింది. దీంతో పోలింగ్​కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడింది.

మొత్తం 86,78,221 మంది ఓటర్లు ఈ ఏడో దశలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 44,44,634 మంది పురుషులు ఉండగా.. 42,33,358 మంది స్త్రీలు ఉన్నారు. 229 మంది ట్రాన్స్​జెండర్లు కూడా ఓటింగ్​లో భాగం కానున్నారు. 14,480 పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 34 స్థానాలకు గానూ 12,068 పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది.

ఇద్దరు అభ్యర్థులు మరణించిన నేపథ్యంలో సంసర్‌గంజ్, జంగిపూర్‌ అసెంబ్లీ స్థానాలకు మే 16న పోలింగ్​ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

తృణమూల్​ పార్టీ సీనియన్​ నాయకుడు అయిన సోవాండేబ్ ఛటోపాధ్యాయ.. భబానిపూర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సినీ నటుడు రుద్రానిల్ ఘోష్‌ భాజపా నుంచి గెలవాలని తహతహలాడుతున్నారు. కోల్​కతా పోర్ట్​ నియోజకవర్గం నుంచి రాష్ట్రమంత్రి ఫిర్హాద్ హకీమ్ బరిలో ఉన్నారు.

ఇదీ చూడండి: బంగాల్​: ఎనిమిదో దశలో 23% మందికి నేరచరిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.