ETV Bharat / bharat

ఆర్మీ ఆఫీసర్లుగా మారిన వీర వనితలు.. భర్త ఆశయాలే ఆయుధంగా..! - క్యాడెట్ హర్వీన్ కహ్లాన్

వీరిద్దరి భర్తలు దేశ సేవకై పోరాడి అమరులయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకున్న ఈ మహిళలు.. వారి బాటలోనే నడుస్తూ.. ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ఆర్మీ అధికారులుగా నియమితులయ్యారు ఈ వీర వనితలు.

Cadet Harveen Kahlon and  Lt Rigzin Chorol

author img

By

Published : Oct 30, 2022, 7:43 PM IST

దేశ సేవకై ప్రాణాలు అర్పించిన భర్తల ఆశయాలను నేరవేర్చేందుకు తమ తల్లితనాన్ని వదులుకుని ఆర్మీ ఆఫీసర్లుగా మారారు ఇద్దరు వీర వనితలు. ఏడాది పాటు కఠిన శిక్షణ అనుభవించిన వీరి వెనుక ఎన్నో కన్నీటి గాథలు దాక్కుని ఉన్నాయి. చెన్నైలో జరిగిన ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ల ఉత్తీర్ణత సాధించి ఆర్మీలోకి ప్రవేశించారు హర్వీన్​ కలోన్​, రిజిన్​ చోరోల్.

Cadet Harveen Kahlon and  Lt Rigzin Chorol
ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ల ఉత్తీర్ణత వేడుకలు

ఆశయ సాధనలో క్యాడెట్ హర్వీన్ కహ్లాన్..

కొడుకుతో క్యాడెట్ హర్వీన్ కహ్లాన్
విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన మేజర్​ కేపీఎస్​ కహ్లాన్​ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఆయన సతీమణి క్యాడెట్ హర్వీన్ కహ్లాన్ ముందుకు వచ్చారు. అందుకోసం తన కొడుకును వదిలి చెన్నైలోని ఆఫీసర్స్​ ట్రైనింగ్​ అకాడమీలో చేరింది. దాదాపు 11 నెలల కఠిన శిక్షణ తర్వాత ఆమె ఇండియన్​ ఆర్మీలోకి ప్రవేశించారు. ఈ ఆనందాన్ని కొడుకుతో పంచుకున్న హర్వీన్.. తన భర్త ఎక్కడ ఉన్న ఈ విజయాన్ని చూస్తుంటారని.. ఆయన కల నెరవేరస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. విధి నిర్వహణ విషయానికి వస్తే తనకు తల్లితనం కంటే దేశమే ముఖ్యమని అన్నారు.

క్యాడెట్ హర్వీన్ కహ్లాన్

లద్దాఖ్​ నుంచి తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్​..
దివంగత రైఫిల్‌మ్యాన్ రిగ్జిన్ ఖండాప్ కలలను నెరవేర్చారు ఆయన భార్య లెఫ్టినెంట్​ రిగ్జిన్ చోరోల్. 22 ఎస్​ఎస్​బి భోపాల్​ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణురాలైన ఆమె.. బిడ్డకు దూరంగా ఉంటూ 11 నెలల ట్రైనింగ్​ను పూర్తి చేసుకుని ఆదివారం ఇండియన్​ ఆర్మీ ఆఫీసర్​గా నియమితులయ్యారు. దీంతో లద్దాఖ్ ​నుంచి ఇండియన్​ ఆర్మీ అధికారిగా నియమితులైన మొదటి మహిళ ఆఫీసర్​గా రిగ్జిన్​ ఘనత వహించారు.

"నేను ఓటీఏలో చేరినప్పుడు నా ప్రయాణం ప్రారంభమైంది. 2021 డిసెంబర్​లో ప్రారంభమైన శిక్షణ 11 నెలలు సాగింది. నా బిడ్డకు దూరంగా ఉంటూ 11 నెలల కఠోర శిక్షణ తీసుకుని.. ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్న నా భర్త కలను నేను నెరవేర్చాను. నా భర్త బతికుంటే నన్ను అధికారిగా చూసి గర్వపడేవారు." అని కొడుకును ముద్దాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మిలటరీ పరేడ్​లో ఆర్మీ ఆఫీసర్లు

ఇదీ చదవండి: ఉచితంగా వైద్యం... రూ.50కే ఆపరేషన్​.. సంస్థ బంపర్ ఆఫర్!

దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.