ETV Bharat / bharat

'టీకా పంపిణీకి డేటాబేస్ తయారు చేయండి' - 'టీకా పంపిణీకి డేటాబేస్ తయారు చేయండి'

వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్రాల అధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సమావేశం నిర్వహించారు. ప్రాధాన్య జాబితాలో ఉన్న వ్యక్తుల వివరాలతో డేటాబేస్ తయారు చేయాలని గౌబా సూచించారు. రాష్ట్రాల సీఎస్​లు, వైద్య శాఖ కార్యదర్శులు ఈ భేటీకి హాజరయ్యారు.

Cabinet Secy discusses with states possible COVID-19 vaccine roll-out
'టీకా పంపిణీకి డేటాబేస్ తయారు చేయండి'
author img

By

Published : Dec 1, 2020, 10:10 PM IST

వ్యాక్సిన్ సరఫరా విషయమై రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కీలక సమావేశం నిర్వహించారు. టీకా పంపిణీకి జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వైద్య సేవల సిబ్బంది సహా టీకా కోసం ప్రాధాన్య జాబితాలో ఉన్న వారి వివరాలతో డేటాబేస్ తయారు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్​లు, వైద్య శాఖ కార్యదర్శులు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

కరోనా వ్యాక్సిన్ సరఫరాకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. టీకా అందుబాటులోకి వస్తే వేగంగా పంపిణీ చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. దేశంలో వ్యాక్సిన్ తయారీలో ముందున్న సంస్థలతో ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించారు.

టీకా అందుబాటులోకి రాగానే ముందుగా వైద్య సేవల సిబ్బందికి అందించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.