ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు రూ.48,000 కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది.
రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత వైమానిక దళంలో తేజస్ ముఖ్య పాత్ర పోషించనుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ ఫైటర్ జెట్లో సరికొత్త సాంకేతికతను ఉపయోగించే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మొదటి స్వదేశీ మెషీన్ గన్ అభివృద్ధి