ETV Bharat / bharat

విద్యుత్ వాహన రంగానికి రూ.18వేల కోట్లు! - విద్యుత్ వాహన రంగానికి భారీగా ప్రోత్సాహకాలు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించి, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ బ్యాటరీ తయారీ కంపెనీలకు రూ. 18వేల కోట్లతో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా విద్యుత్​ బ్యాటరీ తయారీ కంపెనీలకు రూ. 45వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వెల్లడించారు.

union minister prakash javdekar
కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్
author img

By

Published : May 12, 2021, 5:38 PM IST

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్‌ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం సహా అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ బ్యాటరీ తయారీ కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు 18వేల ఒక వంద కోట్ల రూపాయలతో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

భారీగా పెట్టుబడులు

" ఈ పథకం ద్వారా విద్యుత్‌ బ్యాటరీ కంపెనీల ఉత్పత్తి రంగంలో 45వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. మంత్రివర్గ నిర్ణయం వల్ల దేశంలో జీవ ఇంధనం సహా ప్రకృతి వనరులైన కాపర్‌, బాక్సైట్‌ వినియోగం కూడా పెరుగుతుంది."

-- ప్రకాశ్‌ జావడేకర్‌, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి

మానవ జీవితంలోని ప్రతి రంగంతో ముడిపడిన అంశాలకు విద్యుత్‌ బ్యాటరీలతో అనేక రకాల ఉపయోగాలు కలుగుతాయని జావడేకర్ తెలిపారు. ఈ పథకం ద్వారా భారత్‌లో వచ్చే కొన్ని సంవత్సరాల్లో విద్యుత్‌ బ్యాటరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని 50వేల మెగావాట్ల వరకు పెంచడం లక్ష్యమని వివరించారు.

ఇదీ చదవండి : త్వరలో కొవాగ్జిన్ ఉత్పత్తి రెట్టింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.