ETV Bharat / bharat

పునరుత్పాదక ఇంధన ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం - ప్రధాని నరేంద్రమోదీ

పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్​-ఫ్రాన్స్​లు నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2030నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో పురోగతి సాధించేందుకు ప్రణాళికలను పరిశీలించింది.

cabinet approves renewable energy pact between france and india
పునరుత్పాదక ఇంధన ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం
author img

By

Published : Mar 4, 2021, 6:34 AM IST

పునరుత్పాదక ఇంధన సహకారం కోసం మన దేశం ప్రాన్స్‌తో ఈ ఏడాది జనవరిలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం కార్యోత్తర ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశం ఈ ఒప్పందాన్ని పరిశీలించింది. ఉభయులకూ లబ్ధిదాయకమైన రీతిలో, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ప్రాతిపదికన పునరుత్పాదక ఇంధన రంగంలో సహకరించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.

2030 నాటికి ఈ రంగం ద్వారా 450 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి ఎంవోయూ దోహదపడుతుంది. వ్యవసాయ రంగంలో సహకారం, శిక్షణల నిమిత్తం ఫిజీతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు కూడా కేబినెట్‌ సమ్మతించింది. రెండు దేశాలకు చెందిన ప్రభుత్వ రంగాల మధ్య సంయుక్త భాగస్వామ్యానికీ ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.

ఇదీ చదవండి: సౌరశక్తి చుట్టూ దేశం- ఇంధన రంగంలో నవశకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.