ETV Bharat / bharat

'సీఏఏతో మైనారిటీలకు నష్టం లేదు'

పారుగు దేశాలలో వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రక్షణ కల్పిస్తుందని ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భాగవత్‌ పేర్కొన్నారు. హిందూ, ముస్లింల మధ్య అంతరాలకు సీఏఏ, జాతీయ పౌర పట్టికలతో (ఎన్‌ఆర్‌సీ) ఏ మాత్రం సంబంధంలేదని చెప్పారు.

mohan bhagwat
మోహన్ భగవత్​
author img

By

Published : Jul 22, 2021, 7:25 AM IST

హిందూ, ముస్లింల మధ్య అంతరాలకు పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ), జాతీయ పౌర పట్టికలతో (ఎన్‌ఆర్‌సీ) ఏ మాత్రం సంబంధంలేదని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్​​) అధినేత (సర్‌సంఘచాలక్‌) మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. పౌరసత్వ చట్టాల వల్ల ఏ ఒక్క ముస్లింకు నష్టం జరగదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గువాహటిలో బుధవారం ఆయన ప్రొఫెసర్‌ నాని గోపాల్‌ మహంత రాసిన 'సిటిజెన్‌షిప్‌ డిబేట్‌ ఓవర్‌ ఎన్‌ఆర్‌సీ అండ్‌ సీఏఏ' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా పాల్గొన్నారు.

"స్వాతంత్ర్యానంతరం మైనారిటీల సంరక్షణకు దేశ తొలి ప్రధాని హామీ ఇవ్వడం సహా దానిని అమలుపరిచారు. పారుగు దేశాలలో వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వ నవరణ చట్టం రక్షణ కల్పిస్తుంది. విపత్తు సమయాల్లో ఈ దేశాల్లోని మెజారిటీ ప్రజలకూ సాయం చేశాం."

-మోహన్ భాగవత్​, ఆర్​ఎస్ఎస్​ అధినేత

జాతీయ పౌర పట్టిక గురించి చెబుతూ.. ప్రతీ దేశానికి తమ పౌరులెవరో తెలుసుకునే హక్కు ఉంటుందన్నారు భాగవత్. దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగ నిర్దేశిత బాధ్యతల్ని నిర్వర్తించాలని చెప్పారు.

ఇదీ చూడండి: 'భారతీయులందరి డీఎన్​ఏ ఒక్కటే'

ఇదీ చూడండి: 'మాటలు కాదు.. చేతల్లో చూపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.