ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ఏప్రిల్​ 17న ఉప ఎన్నికలు - ఉప ఎన్నికలకు మోగిన నగారా

దేశవ్యాప్తంగా 2 పార్లమెంట్​ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు తేదీని ఖరారు చేసింది ఎన్నికల సంఘం. ఏప్రిల్​ 17న ఓటింగ్​ నిర్వహించి.. మే 2న లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది.

Bypolls to two LS and 14 assembly seats on April 17: EC
ఉప పోరుకు రంగం సిద్ధం- ఎప్పుడంటే?
author img

By

Published : Mar 16, 2021, 9:38 PM IST

దేశంలోని రెండు లోక్​సభ, 14 శాసనసభ స్థానాల ఉప పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. మొత్తం 11 రాష్ట్రాల్లో జరిగే ఈ ఉప ఎన్నికలను ఏప్రిల్​ 17న నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

లోక్​సభ ఉప ఎన్నికల్లో.. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం పార్లమెంట్​ నియోజకవర్గాలకు పోలింగ్​ నిర్వహించనున్నారు. వీటితో పాటు రాజస్థాన్​లో 3, కర్ణాటకలో 2 అసెంబ్లీ స్థానాలు సహా.. గుజరాత్​, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్​, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్​లో ఒక్కో సీటుకు ఓటింగ్​ జరగనుంది.

అయితే.. బంగాల్​లో అదే రోజు(వచ్చే నెల 17న) ఐదో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 2న చేపట్టున్నారు.

ఇదీ చదవండి: ఎన్సీపీ గూటికి కాంగ్రెస్ మాజీ నేత చాకో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.