బంగాల్లో నాలుగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో(west bengal bypolls 2021) అధికార టీఎంసీ ఘన విజయం సాధించింది. దిన్హాటా, గోసబలో లక్షకు పైగా ఓట్ల తేడాతో భాజపాను ఓడించింది. ఇది బంగాల్ ప్రజల విజయమని సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. బంగాల్ ప్రజలు అభివృద్ధికే పట్టం గడతారన్నారు. ఈ గెలుపును విద్వేష రాయకీయాలపై తాము సాధించిన విజయంగా అభివర్ణించారు(west bengal bypoll results 2021).
టీఎంసీ ఘన విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
దిన్హాటా, శాంతిపుర్, గోసబ, ఖార్దహ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిన్హాటాలో భాజపా నేత నిశిత్ ప్రామాణిక్ గెలుపొందారు. ఆయనకు కేంద్ర సహాయమంత్రిగా తీసుకోవడం వల్ల ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు టీఎంసీ 1.6లక్షల ఓట్లకుపైగా మెజార్టీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది(west bengal by election 2021 results ).
ఇదీ చదవండి: హిమాచల్ ఉప ఎన్నికల్లో భాజపాకు కాంగ్రెస్ షాక్!