ETV Bharat / bharat

Bus Accident in Uttarakhand : లోయలో పడ్డ గంగోత్రి యాత్రికుల బస్సు.. ఎనిమిది మృతి - బస్సు ప్రమాదంలో పలువురు మృతి

Bus Accident in Uttarakhand Today : ఉత్తరాఖండ్​ గంగోత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. 35 మంది భక్తులతో ఉత్తరకాశీ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఆదివారం ఈ ఘటన జరిగింది.

Bus Accident in Uttarakhand
Bus Accident in Uttarakhand
author img

By

Published : Aug 20, 2023, 6:01 PM IST

Updated : Aug 20, 2023, 8:00 PM IST

Bus Accident in Uttarakhand Today : ఉత్తరాఖండ్​ గంగోత్రిలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఆదివారం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. గంగోత్రి రహదారిపై గన్​గ్నానీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 35 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. వీరంతా గుజరాత్​కు చెందిన వారిగా తెలిసింది.

bus-accident-in-uttarakhand-today-bus-full-of-33-passengers-fell-uncontrolled-on-gangotri-highway-at-uttrakhand
ఉత్తరాఖండ్​ రోడ్డు ప్రమాదం

Uttarakhand Bus Accident : బస్సు గంగోత్రి ధామ్ నుంచి ఉత్తరకాశీ వైపు వెళుతుండగా సాయంత్రం 4.15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ముందుగా ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అక్కడికి చేరుకుని బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్చలు చేపట్టి గాయపడ్డవారిని కాపాడారు. 27 మంది ప్రయాణికులను రక్షించి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి విచారం వ్యక్తం చేశారు.

లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. 9 మంది సైనికులు మృతి..
Army Vehicle Accident Today : శనివారం సాయంత్రం ఇలాంటి ఘటనే జరిగింది. సైనికులతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది సైనికులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాఖ్​లోఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ జవాన్​ను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

నదిలో పడ్డ బస్సు.. లోపల 30మంది ప్రయాణికులు.. టెన్షన్​ టెన్షన్​..
Bus Fell InTo River In Jharkhand Today : రెండు వారాల క్రితం ఝార్ఖండ్​లోని గిరిడీహ్​ జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి బరాకర్​ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడగా.. ఇద్దరు మృతి చెందారు. ఘటనాసమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

'చైనా ఆక్రమణలో భారత భూభాగం'.. రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. కేంద్ర మంత్రి కౌంటర్

రిటైరైన 'పోలీస్​ డాాగ్'​లకు వృద్ధాశ్రమం.. సదుపాయాలు అదుర్స్​.. యాక్టివ్​గా ఉండేందుకు మ్యూజిక్‌ సిస్టమ్ కూడా..

Last Updated : Aug 20, 2023, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.