Bus Accident: మధ్యప్రదేశ్ అలీరాజ్‌పుర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నాడు.

క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులను కలెక్టర్, ఎస్పీ సహా పలువురు పరామర్శించారు.

ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చందాపుర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్సు గుజరాత్‌లోని చోటా ఉదయ్‌పుర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్పుర్కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.
డ్రైవర్ నిద్రపోయిన కారణంగానే బస్సు మెల్‌ఖోద్రా నదిలో పడిపోయిందని తెలుస్తోంది.


ఇదీ చూడండి: ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు