ETV Bharat / bharat

Bullet train project: మూడు గంటల్లో ముంబయి టు హైదరాబాద్‌! - హైదరాబాద్​ నుంచి ముంబయి బుల్లెట్​ రైలు ప్రాజెక్ట్​

హైదరాబాద్‌ నుంచి ముంబయి నగరానికి కేవలం మూడు గంటల వ్యవధిలోనే చేరుకొనే రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌-ముంబయి(Hyderabad to Mumbai bullet train) మధ్య బుల్లెట్‌/హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు(Bullet train project) సాధ్యాసాధ్యాలపై సర్వే చేపట్టింది.

Bullet train
బుల్లెట్​ రైలు
author img

By

Published : Sep 28, 2021, 9:55 AM IST

ముంబయితోపాటు భాగ్యనగర్‌ వాసులకు మరో అత్యాధునిక రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Hyderabad to Mumbai bullet train) నగరానికి మూడు గంటల వ్యవధిలోనే చేరుకొనే సదుపాయం త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్‌-ముంబయి మధ్య బుల్లెట్‌/హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సర్వే చేపట్టింది. భూసేకరణపైనా దృష్టి సారించింది.

దీనిలో భాగంగా మహారాష్ట్రలోని ఠాణె జిల్లా అధికారులకు ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు(Bullet train project) సమాచారాన్ని తెలియజేసింది. హైదరాబాద్‌-ముంబయి మధ్య మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల భూభాగాల్లో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. సంబంధిత వివరాలను ఠాణె జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ప్రశాంత్‌ సూర్యవంశీ, ఇతర అధికారులకు జాతీయ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.కె.పాటిల్‌ దృశ్యరూపంలో వివరించారు. పూర్తి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌-ముంబయిల మధ్య దూరం 650 కి.మీ. కాగా ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి దాదాపు 14 గంటల సమయంపడుతోంది. అదే బుల్లెట్‌ రైలు అందుబాటులోకి వస్తే మూడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

ఇదీ చూడండి: కశ్మీర్‌-లద్దాఖ్‌ పర్యటకానికి కొత్త వన్నెలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.