ETV Bharat / bharat

కోర్టు ఆవరణలో కాల్పులు - క్లయింట్ల మధ్య గొడవే కారణం - రోహిణి కోర్టు వార్తలు

Rohini court: దిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో తుపాకీ పేలింది. దీంతో కాసేపు అక్కడ గందరగోళం నెలకొంది. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడం వల్ల అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇద్దరు న్యాయవాదుల క్లయింట్​లు గొడవపడుతుంటే ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్​ తుపాకీ పేలిందని చెప్పారు.

Bullet fired at Delhi's Rohini court complex

author img

By

Published : Apr 22, 2022, 12:03 PM IST

Updated : Apr 22, 2022, 12:44 PM IST

Rohini court news: దిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో బుల్లెట్ శబ్దం కలకలం రేపింది. నాగలాండ్​ పోలీస్​ సిబ్బంది తుపాకీ నుంచి ఈ తూటా పేలింది. ఇద్దరు లాయర్లకు చెందిన క్లయింట్​లు గొడవ పడుతున్న సమయంలో ఈ బుల్లెట్ పేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. క్లయింట్​లు​ గొడవపడే సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బందిలోని పోలీస్ ప్రయత్నించాడని, ఆ క్రమంలో తుపాకీ నుంచి తూటా దూసుకొచ్చి నేలకు తాకిందని చెప్పారు. అది సర్వీస్​ రివాల్వరే అని స్పష్టం చేశారు.

Rohini court gun fire: బుల్లెట్ శబ్దంతో రోహిణి కోర్టు ఆవరణలో కాసేపు గందరగోళం నెలకొంది. శుక్రవారం ఉదయం కోర్టు బయటే ఈ ఘటన జరిగింది. అయితే పోలీస్​ తుపాకీ నుంచి తూటా అనుకోకుండా పేలిందా, లేదా కావాలనే కాల్పులు జరిపాడా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరికీ హాని జరగనందున ఊపిరిపీల్చుకున్నారు. అయితే కోర్టు సమీపంలో ఉన్న వారంతా తుపాకీ పేలుడు చప్పుడు విని ఉలిక్కిపడ్డారు.

ఇదీ చదవండి: సీఐఎస్ఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదుల దాడి

Last Updated : Apr 22, 2022, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.