ETV Bharat / bharat

'ఆ రెండు రోజులు.. జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయం ఉండదు'

Budget Session: పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం, ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఆ రెండు రోజులు ఉభయ సభల్లో జీరో అవర్​, ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించటం లేదని కేంద్రం తెలిపింది.

Budget Session
పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు
author img

By

Published : Jan 29, 2022, 3:28 PM IST

Budget Session: జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. దాంతో ఈ రెండు రోజులు పార్లమెంట్‌లో జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించడం లేదని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఫిబ్రవరి రెండు నుంచి జీరో అవర్‌లో లేవనెత్తవచ్చని పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ బడ్జెట్‌లో తమ ఆకాంక్షలు ఏమేరకు నెరవేరుతాయా అని ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఈ సంవత్సరం కూడా బడ్జెట్ సెషన్ రెండు భాగాలుగా జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి 11 వరకు మొదటి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశలో ఈ సెషన్‌ను నిర్వహించనున్నారు. కొవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైరస్ కారణంగా లోక్‌సభ, రాజ్యసభలను షిఫ్ట్‌ల వారీగా నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: Budget Session: ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్​సభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.