రెండో దఫా బజ్డెట్ సమావేశాలను కుదించే అవకాశాలున్నట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ నెల 27న తొలిదశ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు... ఉభయ సభల సమావేశాలు మంగళవారం నుంచి 11 గంటలకు ప్రారంభం కానున్నట్టు సమాచారం.
సోమవారం(మార్చి 8న) ప్రారంభమైన రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. వాస్తవానికి ఏప్రిల్ 8న ముగియాల్సి ఉంది. అయితే.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, వీటిని కుదించాలని ఆయా పార్టీలు కోరాయి. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికంటే ముందుగానే ఉభయ సభా సమావేశాలు ముగియనున్నాయి.
ఇదీ చదవండి: ప్రతిపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా