ETV Bharat / bharat

బడ్జెట్​ సెషన్​.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్​ స్కెచ్​! - సోనియా గాంధీ

Congress Parliamentary Party: దిల్లీలోని 10 జన్​పథ్​లో కాంగ్రెస్​ పార్లమెంటరీ వ్యూహ బృందం భేటీ అయింది. సోమవారం పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల రెండో భాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించి ఉభయ సభల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు నేతలు.

Congress Parliamentary strategy group
మల్లికార్జున్​ ఖర్గే
author img

By

Published : Mar 13, 2022, 11:50 AM IST

Congress Parliamentary Party: పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల రెండో అర్ధభాగం సోమవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్​ పార్లమెంటరీ వ్యూహ బృందం భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం 10 జన్​పథ్​లో సమావేశమయ్యారు నేతలు. ఈ భేటీకి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు మల్లికార్జున్​ ఖర్గే, ఆనంద్​ శర్మ, కే సురేశ్​, జైరామ్​ రమేశ్​లు హజరయ్యారు. బడ్జెట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్లు కే సురేశ్​ తెలిపారు.

"రానున్న పార్లమెంట్​ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించాం. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్​ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నిస్తాం."

- మల్లికార్జున్​ ఖర్జే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత.

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల రెండో అర్ధభాగం మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్​ 8 వరకు జరగనుంది. తొలిఅర్ధభాగం గత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగింది.

ఇదీ చూడండి:

సంక్షేమానికే యూపీ ప్రజల ఓటు.. పనిచేసిన మోదీ 'మేజిక్​'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.