Budget session 2022 modi speech: ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ప్రపంచానికి భరోసా ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. టీకా పంపిణీ కార్యక్రమం, భారత్లో తయారైన వ్యాక్సిన్ల గురించి ప్రపంచానికి చాటి చెబుతాయని ఉద్ఘాటించారు.
budget session 2022
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల మధ్య భారత్కు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత సమావేశంలో రాజకీయ పార్టీలన్నీ నాణ్యమైన చర్చకు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
pm narendra modi news
"దేశ ఆర్థిక వృద్ధి, వ్యాక్సినేషన్ కార్యక్రమం, భారత్లో తయారయ్యే టీకాలపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ బడ్జెట్ సమావేశాలు ఉపయోగపడతాయి. ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీలు నాణ్యమైన చర్చలు జరిగేలా చూస్తారని ఆశిస్తున్నా. ఎన్నికల ప్రభావం ఈ సమావేశాలపై, చర్చలపై ఉంటుందనేది నిజమే. ఎన్నికలు నడుస్తూనే ఉంటాయి. కానీ బడ్జెట్ అనేది ఏడాది మొత్తానికి మార్గనిర్దేశం అందిస్తుంది. ఈ సమావేశాలు ఎంత ఫలప్రదమైతే.. ఈ ఏడాది దేశం ఆర్థికంగా పురోగమించేందుకు అన్ని అవకాశాలు లభిస్తాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: