ETV Bharat / bharat

ఇంటర్ పూర్తి చేశారా?.. BSF నోటిఫికేషన్ మీకోసమే.. జీతం రూ.81వేలు! - బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ అర్హతలు

బోర్డర్‌లో ఉండి దేశానికి సేవ చేయాలనే కోరిక చాలా మందికి యువకులకు ఉంటుంది. జవాన్‌గా మారి దేశాన్ని కాపాడాలని, దేశ రక్షణ కోసం పనిచేయాలని అనుకుంటూ ఉంటారు. రోజూ కలలు సైతం కంటూ ఉంటారు. అలాంటి యువతకు తాజాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శుభవార్త తెలిపింది. బీఎస్​ఎఫ్​ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

bsf-notification-2023-online-apply-last-date-and-eligibility-also-other-details
బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్
author img

By

Published : Apr 20, 2023, 12:56 PM IST

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(BSF).. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హెడ్ కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి బీఎస్‌ఎఫ్ ప్రస్తుతం ఆసక్తికర అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఏప్రిల్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మే 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో వివిధ విభాగాల పోస్టులు ఉన్నాయి. హెచ్‌సీ రేడియో ఆపరేషన్(ఆర్‌ఓ), హెచ్‌సీ రేడియో మెకానిక్స్(RM) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టరేట్, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కలిపి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 2023 పేరిట తాజాగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. హెచ్‌సీ రేడియో ఆపరేషన్స్(ఆర్‌ఓ) పోస్టులు 217 ఉండగా.. హెచ్‌సీ రేడియో మెకానిక్స్(ఆర్‌ఎం) పోస్టులు 30 ఉన్నాయి.

విద్యార్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ (MPC) పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. లేదా టెన్త్ క్లాస్‌తో పాటు రెండు సంవత్సరాల ఇండస్ట్రీయల్ ట్రైనింగ్‌లో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని బీఎస్‌ఎఫ్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఫీజు వివరాలు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మహిళలు, ఎస్సీ,ఎస్టీ, ప్రస్తుతం మిలటరీలో పనిచేస్తున్న వారికి ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. వీరంతా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి..
ఈ పోస్టులకు వయోపరిమితి కూడా విధించారు. ఈ ఏడాది మే 12 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

వేతనం ఇతర వివరాలు..
ఉద్యోగం సాధించినవారికి రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇంటర్ పాస్‌తో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వచ్చే అవకాశం ఉండటం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు.

ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి?

  • బీఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ సెక్షన్‌ మీద క్లిక్ చేయాలి.
  • బీఎస్‌ఎఫ్ ఆర్‌ఓ/ఆర్‌ఎం రిక్రూట్‌మెంట్-2023 అని ఉండే లింక్ మీద క్లిక్ చేయలి.
  • కొత్త విండోలో వచ్చే దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • దరఖాస్తు పూర్తయిన తర్వాత.. అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.