ETV Bharat / bharat

'2020లో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం'

దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ చరిత్రలో తొలిసారి గతేడాది ఆర్థిక మంత్రి పలు ప్యాకేజీల రూపంలో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని చెప్పారు. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల ప్రారంభానికి ముందు ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

author img

By

Published : Jan 29, 2021, 12:28 PM IST

Updated : Jan 29, 2021, 1:14 PM IST

brought-4-5-mini-budgets-in-2020-says-modi
2020లో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యమని తెలిపారు.

" ఈ దశాబ్దానికి పార్లమెంట్‌ తొలి సెషన్‌ నేడు ప్రారంభం కానుంది. దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యం. మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాకారం చేసేందుకు బంగారం లాంటి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఈ అంశాలపైనే ఈ సారి సమావేశాలు సాగాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అంశాలపైనే చర్చలు జరగాలి. ఇది బడ్జెట్‌ సెషన్‌. దేశ చరిత్రలో తొలిసారి గతేడాది ఆర్థిక మంత్రి పలు ప్యాకేజీల రూపంలో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. కాగా.. సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నేపథ్యంలో తొలి రోజు సమావేశాల్లో గందరగోళం తలెత్తే అవకాశాలున్నాయి. ఈ అంశంపై తొలి రోజే నిరసన చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే..

పార్లమెంట్​ ఉభయ సభలనుద్దేశించి చేసే రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రసంగానికి ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం దురదృష్టకరమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్​ రామ్​ మేఘ్​వాల్​ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం రాజకీయాలకతీతమైనదని, సభ్యులందరూ హజరుకావాల్సిందని తెలిపారు. ప్రజాస్వామ్యానికి అగౌరవాన్ని కలిగించే విధంగా ప్రతిపక్షాల చర్య ఉందని కేంద్ర మంత్రి, భాజపా ఎంపీ గిరిరాజ్​ సింగ్​ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాకపోవడం.. ప్రజాస్వామ్య గౌరవాన్ని అవమానించడమేనని ఆరోపించారు. .

ఇదీ చదవండి:'రిపబ్లిక్​ డే' ఘటన బాధ కలిగించింది: రాష్ట్రపతి

Last Updated : Jan 29, 2021, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.