ETV Bharat / bharat

పరువు హత్య: బావను పొడిచి చంపిన మరుదులు!

బావమరుదులు ఎప్పుడూ బావ బతుకు కోరతారు అంటారు. కానీ మధ్యప్రదేశ్​ ఇండోర్​లో మాత్రం అందుకు భిన్నంగా చావు కోరారు. సోదరి భర్తను అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు.

brothers-murdered-sisters-husband-in-indore
పరువు హత్య :బావని పొడిచి చంపిన బావమర్దులు
author img

By

Published : Mar 1, 2021, 2:01 PM IST

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో దారుణం జరిగింది. సోదరి భర్తను అత్యంత కిరాతకంగా పొడిచి హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. నిందితులను నగరంలోని రాజీవ్​ బజార్​కు చెందిన మహ్మద్​ అయాజ్​​, వకార్​గా పోలీసులు గుర్తించారు. ఇది పరువు హత్య అని భావిస్తున్నారు.

ఇదీ జరిగింది...

సమీర్​, అల్మా ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడం వల్ల పారిపోయిన వారు రెండు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. ఆయాజ్​, వకార్​కు అల్మా​ ఒకే చెల్లిలు కావడం కారణంగా.. ఆమె చేసిన పనితో పరువు పోయిందని భావించారు. అయితే కొత్త దంపతులను ఇంటికి భోజనానికి రావాలని పిలిచారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అంతరాలు తొలిగిపోయినట్లు నమ్మబలికారు. ఇంటి పక్కన దుకాణం తెరిస్తే.. సోదరి దగ్గరగా ఉంటుందని ప్రేమను నటించారు. వారి మాటలు నిజమని నమ్మిన సమీర్​, భార్య అల్మాతో కలిసి వెళ్లారు. దుకాణం చూపించే పేరుతో అన్నదమ్ములు ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమీర్​ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

"సమీర్​ అనే వ్యక్తి దేవాస్​ ప్రాంతానికి చెందిన వారు. ఆదివారం సాయంత్రం తన భార్యతో పాటు బావమరుదుల ఇంటికి వెళ్లారు. నిందితులు అయాజ్​, వకార్​ అతడిని మోతీ తబేలా అనే ప్రాంతంలో కత్తితో పొడిచి చంపారు."

-దిశేశ్​ అగర్వాల్​, ఇండోర్​ కమిషనర్​

ఇదీ చూడండి: ప్రేమించి పెళ్లికి నిరాకరణ- జైల్లోనే తాళి కట్టించిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.