Brother Killed Sister In Maharashtra : తమ సోదరి వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని ఆమెను.. అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు ఇద్దరు సోదరులు. భయంతో దాక్కున్నా.. వెతికి మరీ హతమార్చారు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సాంబాజీనగర్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మాయత్ చంద్రకళ అనే యువతి తన కుటుంబంతో పాటు నివసిస్తోంది. అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది చంద్రకళ. దీన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆమె తాను ప్రేమించిన వ్యక్తితో అతడి ఇంట్లోనే సహజీవనం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి ఇద్దరు సోదరులు.. ఆమెను చంపేందుకు గొడ్డళ్లతో బయలుదేరారు. ఈ విషయం తెలిసిన యువతి.. షమీమ్ షా అనే వ్యక్తి సహాయంతో సమీపంలో ఉన్న ఓ మేకల కొట్టంలో దాక్కుంది. తన సోదరిని ఎలాగైనా చంపాలని ఆగ్రహంతో ఊగిపోతున్న నిందితులు.. ఆమె కోసం వెతికారు. అనంతరం మేకలో కొట్టంలో దాక్కున్న.. ఆమెను పట్టుకుని గొడ్డళ్లతో దారుణంగా నరికారు. తీవ్రంగా గాయపడ్డ యువతి రక్తపు మడుగులో కొట్టుకుని మృతి చెందింది. బాధితురాలికు సహాయం చేసిన వ్యక్తిపై కూడా నిందితులు దాడి చేశారు. అనంతరం అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో.. మేకల మధ్య రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం యువతి సోదరులతో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
వివాహితపై అత్యాచారం.. ఆపై కాల్పులు..
బిహార్.. సహర్సా జిల్లాలో వివాహితపై ఆమె బంధువు సహా మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆమె ఎడమకాలులో బుల్లెట్ తగిలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత నివసిస్తోంది. ఆర్ధరాత్రి సమయంలో ఆ మహిళను.. ఆమె బంధువు, అతడితో వచ్చిన ఓ వ్యక్తి బలవంతంగా బైక్పై సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలు కేకలు వేయడం వల్ల ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో బాధితురాలి ఎడమ కాలికి బుల్లెట్ తగిలింది. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ.. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురిని గొడ్డలితో నరికి హత్య.. ఆపై గన్తో కాల్చుకుని సూసైడ్.. ఏం జరిగింది?
ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..