ETV Bharat / bharat

పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు! - వధువు చెంపదెబ్బ వీడియో

పెళ్లిమండపంలో వధూవరులు పక్కపక్కన కూర్చొని ఉన్నారు. వారిచుట్టూ బంధువులు చేరారు. ఉత్సాహంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో పెళ్లిపీటలపై ఉన్న వధువు కోపంగా ఉంది(angry bride). తనకు నచ్చని పనిచేసిన వరుడికి కాబోయే భార్య ఊహించని షాక్ ఇచ్చింది.

Angry Bride
Angry Bride
author img

By

Published : Aug 27, 2021, 8:15 PM IST

Updated : Aug 27, 2021, 9:00 PM IST

కొత్త జీవితానికి స్వాగతం పలికే పెళ్లి వేడుక(marriage ceremony) ప్రతి ఒక్కరికీ సుమధురమైన ఘట్టం. అయితే అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు వివాహ తంతు రసాభాసగా మారుతుంటుంది. ఇలాంటి ఘటనే తాజాగా నెట్టింట వైరల్​గా మారింది.

ఒక్కసారిగా ఉద్రిక్తత..

బంధుమిత్రుల మధ్య ఓ వివాహ తంతు ఉత్సాహంగా సాగుతోంది. అయితే.. తనకు కాబోయే భర్త పొగాకు నములుతున్నాడని(bride chewing tobacco) వధువుకు తెలియడం వల్ల అక్కడి వాతావరణం వేడెక్కింది. దీనిని అసహ్యించుకున్న ఆమె.. వరుడితో పాటు ఎదురుగా ఉన్న వ్యక్తిని కొట్టింది. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న వరుడు వెంటనే లేచి నిలుచుని నోటిలోని పొగాకును ఉమ్మేశాడు. వరుడిని కొడుతుండగా వధువును ఎవరూ ఆపకపోవడం గమనార్హం.

అవగాహనకు వేదిక..?

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వధువు చర్యను ప్రశంసిస్తున్నారు. పెళ్లి పీటలపై పొగాకు తింటున్న వరుడిపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ వీడియో తీశారని కొందరు కామెంట్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 27, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.