ETV Bharat / bharat

చనిపోయిన ఏడు గంటలకు మళ్లీ బతికిన వ్యక్తి!

ఉత్తర్​ప్రదేశ్​లోని మోర్దాబాద్​ జిల్లాలో వింత ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అనుకున్న వ్యక్తి మళ్లీ బతికాడు. దాదాపు ఏడు గంటల తర్వాత పోస్ట్​మార్టంకు ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు చనిపోయిన వ్యక్తి శ్వాసతీసుకోవడం గుర్తించారు.

uttar pradesh news
చనిపోయిన ఏడు గంటలకు మళ్లీ బతికిన వ్యక్తి!
author img

By

Published : Nov 19, 2021, 10:52 PM IST

పాల కోసమని బయటకు వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అతను చనిపోయినట్లు నిర్ధరించారు. ఇదంతా గురువారం రాత్రి జరిగిన విషయం. శుక్రవారం ఉదయం అతని పోస్ట్​మార్టంకు సిద్ధం చేస్తున్న పోలీసులు విస్తుపోయారు. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికాడు. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మోర్దాబాద్​ జిల్లాలో జరిగింది.

uttar pradesh news
శ్రీకేశ్​ను పర్యవేక్షిస్తున్న వైద్య సిబ్బంది

మోర్దాబాద్​ కార్పొరేషన్​లో పనిచేస్తున్న శ్రీకేశ్​​ను రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొంది. బంధువులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు పోస్ట్​మార్టం చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తుండగా శ్రీకేశ్​ శ్వాసతీసుకోవడం గుర్తించారు. వైద్యులకు సమాచారం అందించగా శ్రీకేశ్​ బతికే ఉన్నట్లు నిర్ధరించారు. అనంతరం ఐసీయూకి తరలించారు.

చనిపోయాడనుకున్న శ్రీకేశ్​ మళ్లీ బతకడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : యూపీలో రూ.3.5వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.