ETV Bharat / bharat

ఆ హైకోర్టులో బ్రెయిలీ లిపిలోనూ ఉత్తర్వులు.. ప్రత్యేక ప్రింటర్​ ఏర్పాటు

author img

By

Published : Nov 15, 2021, 11:03 AM IST

బ్రెయిలీ లిపిలో కోర్టు ఉత్తర్వుల కాపీలను అందించేందుకు వీలుగా ప్రత్యేక ప్రింటర్​ను(Braille printer) మద్రాస్​ హైకోర్టు ఏర్పాటు చేసింది. అంధులైన న్యాయవాదులకు ఉపయోగపడేలా.. సోమవారం నుంచి దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

BRAILLE PRINTER
బ్రెయిలీ ప్రింటర్

అంధులైన న్యాయవాదుల కోసం మద్రాస్ హైకోర్టు(Madras high court) ప్రత్యేక సదుపాయాన్ని(Braille printer) అందుబాటులోకి తెచ్చింది. బ్రెయిలీ లిపిలో కోర్టు ఉత్తర్వుల కాపీల్ని అందించేందుకు వీలుగా ప్రత్యేక ప్రింటర్‌ను(Braille printer) సోమవారం నుంచి ప్రవేశపెట్టింది. ఈ మేరకు కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పి.ధనబల్‌ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు.

దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం బ్రెయిలీ ప్రింటర్​ను(Braille printer) ఏర్పాటు చేసినట్లు మద్రాస్​ హైకోర్టు(Madras high court) తెలిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించిన ఉత్తర్వులు కూడా బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉంచుతామని చెప్పింది. ఈ ప్రింటర్​ను ప్రిన్సిపల్‌ జడ్జి సీటు దగ్గర ఉంచినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: 'కోర్టులంటే గౌరవం లేదా! మరీ ఇంత అహంకారమా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.