దిల్లీలో దారుణం వెలుగు చూసింది. తన సోదరిని తుపాకీతో కాల్చాడు ఓ బాలుడు. ఈ ఘటన ఉత్తర దిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలో జరిగింది.
అసలేమైంది?
తన సోదరి ఓ అబ్బాయితో వాట్సాప్ చాటింగ్, ఫోన్లో మాట్లాడుతుండగా చూశాడు 17 ఏళ్ల బాలుడు. మానుకోవాలని పలుమార్లు సోదరిని హెచ్చరించాడు. అయినా ఆమె ఛాటింగ్ కొనసాగిస్తూనే ఉంది. గురువారం ఉదయం ఆ అమ్మాయి మళ్లీ తన స్నేహితుడితో ఛాటింగ్ చేస్తుండగా చూశాడు బాలుడు. ఈ క్రమంలో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోపోద్రిక్తుడై సోదరిని కడుపులో నాటు తుపాకీతో కాల్చాడు.
గాయపడ్డ అమ్మాయి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పులకు పాల్పడ్డ సదరు బాలుడిని పోలీసులు నిర్బంధించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. తన స్నేహితుని వద్ద నుంచి తుపాకీని బాలుడు సంపాదించినట్లు డీఎస్పీ వేద్ ప్రకాష్ సూర్య తెలిపారు.
అమ్మాయి పాఠశాల విద్యను మధ్యలో ఆపేయగా.. బాలుడు ఓ సెలూన్లో పని చేస్తూ దూరవిద్యలో చదువుతున్నాడు.
ఇదీ చూడండి:ఆదాయం రూ.1000.. కరెంటు బిల్లు 29 వేలు!