ETV Bharat / bharat

Boy Saves Many Lives : పట్టాలపై గుంత.. రైలుకు ఎదురెళ్లిన పదేళ్ల బాలుడు.. వందల మంది ప్రాణాలు సేఫ్​! - వందల ప్రాణాలు కాపాడిన పదేళ్ల బాలుడు

Boy Saves Many lives : పదేళ్ల బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలును పెను ప్రమాదం నుంచి తప్పించాడు. వందల మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. దీంతో స్థానికంగా ఒక్కసారిగా హీరో అయిపోయాడు. బాలుడి సాహసానికి మెచ్చి నార్త్​ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే అవార్టు ప్రకటించింది.

Boy Saves Many lives
Boy Saves Many lives
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 10:53 PM IST

Boy Saves Many lives : బంగాల్​.. మల్దా జిల్లాలోని పదేళ్ల ఓ బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వందలాది ప్రాణాలు కాపాడాడు. పట్టాలపై వేగంగా దూసుకు వస్తున్న రైలును త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించాడు. దీంతో రైల్వే శాఖ సహా అందరి ప్రశంసలు అందుకుంటూ స్థానికంగా హీరో అయిపోయాడు.

ఇదీ జరిగింది
ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు హరిశ్చంద్రపుర్ రెండో బ్లాక్‌లోని మషల్దా గ్రామ పంచాయతీలోని కరియాలి గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తండ్రి పని కోసం వలస వెళ్లడం వల్ల.. తల్లి, సోదరి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న కుంటలో చేపలు పట్టడానికి వెళ్లాడు ముర్సెలీమ్. అతడు చేపలు పడుతున్న ప్రదేశానికి సమీపంలో రైలు పట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలో ముర్సెలీమ్​ రైలు పట్టాల కింద పెద్ద గుంత ఉండటం గమనించాడు. ఈ ప్రాంతంలో ఇటీవల వర్షాలు పడటం వల్ల.. పట్టాల కింద కంకర కొట్టుకుపోయి గుంత పడినట్లు భావిస్తున్నారు.

అయితే అంతలోనే పట్టాలపై వందల మంది ప్రయాణికులతో కాంచన్​జుంగా ఎక్స్​ప్రెస్​ వేగంగా దూసుకువస్తోంది. దీనిని గమనించి అప్రమత్తమైన ముర్సెలీమ్​.. వేగంగా పట్టాల వద్దకు పరుగెత్తాడు. తన ఒంటిపై ఉన్న ఎర్ర టీషర్టు విప్పి లోకోపైలట్​కు సిగ్నల్​ ఇచ్చాడు. అలా టీషర్టు ఊపుతూ కొద్దరి సేపు నిలబడ్డాడు. ఇది గమనించిన లోకోపైలట్​ అప్రమత్తమై.. రైలు నిలిపివేశాడు. అనంతరం ఇంజిన్​ దిగి చూసి బాలుడిని అభినందించాడు. అనతంరం రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే జీఆర్​పీ, ఆర్​పీఎఫ్​, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంధ్రాన్ని పూడ్చివేశారు. గంట తర్వాత రైలు యథావిథిగా బయలుదేరింది.

ఈ సంఘటన తర్వాత ముర్సిలీమ్​ స్థానికంగా ఒక్కసారిగా హీరో అయిపోయాడు. శుక్రవారం రాత్రి నుంచి అతడి ఇంటివద్దకు భారీగా జనం వచ్చి ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన తూర్పు రైల్వే ఛీప్​ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- సీపీఆర్​ఓ కౌశిక్ మిత్రా.. ముర్సెలీమ్​ను ప్రశంసించారు. నార్త్​ ఈస్టర్న్​ ఫ్రాంటియర్​ రైల్వే తరఫున ముర్సెలీమ్​కు అవార్డు ప్రకటించారు.

రైలు పట్టాలకు పగుళ్లు.. ఎర్ర వస్త్రాన్ని చూపి వేల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన రైతు

చీర సాయంతో వందలాది ప్రాణాలు కాపాడిన బామ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.