ETV Bharat / bharat

చాక్లెట్ కోసం నది ఈది, బోర్డర్ దాటి భారత్​లోకి.. టైమ్​ బాగోక జైలుకు! - boy cross border alone

చాక్లెట్​ కొనుక్కునేందుకు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించిన బాలుడ్ని బీఎస్​ఎఫ్​ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని స్థానిక పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది.

india bangladesh border
చాక్లెట్ కోసం నది ఈది, బోర్డర్ దాటి భారత్​లోకి.. టైమ్​ బాగోక జైలుకు!
author img

By

Published : Apr 15, 2022, 4:00 PM IST

ఇమాన్ హుస్సేన్.. బంగ్లాదేశీ టీనేజర్. భారత్​-బంగ్లాదేశ్​కు సరిహద్దుగా ఉండే షాల్డా నది సమీపంలోని ఓ గ్రామంలో ఉంటాడతడు. భారత్​లో దొరికే చాక్లెట్లు అంటే ఇమాన్​కు చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు వాటి కోసం త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్​చౌరా గ్రామానికి వస్తుండేవాడు. ఈ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగేది కాదు. పాస్​పోర్టులు, వీసాలు లేకుండా దేశ సరిహద్దు దాటడం కష్టమే అయినా.. చాక్లెట్​ కోసం సాహసం చేసేవాడు ఇమాన్. ముందు షాల్డా నదిని ఈది, భారత్​ వైపునకు వచ్చేవాడు. తర్వాత సరిహద్దు కంచెలో ఎక్కడైనా రంధ్రాలు ఉన్నాయేమో చూసుకుని.. జాగ్రత్తగా భారత్​లోకి 'చొరబడేవాడు'. దగ్గర్లోని దుకాణంలో చాక్లెట్ కొనుక్కుని అదే దారిలో తిరిగి వెళ్లిపోయేవాడు.

ఇమాన్​ హుస్సేన్ చాక్లెట్ యాత్రలు ఇప్పటివరకు బాగానే సాగాయి. ఏప్రిల్ 13న మాత్రం కథ అడ్డం తిరిగింది. అక్రమంగా బోర్డర్ దాటుతున్న ఇమాన్​ను సరిహద్దు భద్రతా దళం పట్టుకుంది. సోనమురా పోలీసులకు అప్పగించింది. వారు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఇమాన్​కు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

"బంగ్లాదేశ్ కోమిల్లా జిల్లాకు చెందిన బాలుడు చాక్లెట్​ కొనుక్కునేందుకు భారత్​లోకి చొరబడినట్లు విచారణలో అంగీకరించాడు. అతడి వద్ద 100 బంగ్లాదేశీ టాకాలు మాత్రమే ఉన్నాయి. చట్టవిరుద్ధమైన వస్తువులేవీ లేవు. సరైన పత్రాలు లేకుండా భారత్​లోకి ప్రవేశించినందుకే ఇమాన్​ను అరెస్టు చేశాం. విచారణ జరుగుతోంది. రిమాండ్ పూర్తయ్యాక అతడ్ని మళ్లీ కోర్టులో హాజరుపరచుతాం. అతడ్ని భవిష్యత్​ను న్యాయస్థానమే నిర్ణయిస్తుంది." అని తెలిపారు సోనమురా పోలీసు అధికారి బనోజ్ బిప్లబ్ దాస్. మరోవైపు.. ఇమాన్​ కుటుంబసభ్యులు ఎవరూ భారత అధికారుల్ని ఇంకా సంప్రదించలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అలా వచ్చిపోతుంటారు!: "కిరాణా సామగ్రి కొనుక్కునేందుకు, వివాహాలు వంటి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు బంగ్లాదేశీలు ఇలా సరిహద్దు దాటి భారత్​లోకి వస్తుంటారు. మానవతా కోణంలో బీఎస్​ఎఫ్​ వారిని పెద్దగా పట్టించుకోదు. స్మగ్లర్లపై మాత్రమే చర్యలు తీసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ బాలుడు చాక్లెట్ కొనుక్కునేందుకు వచ్చినవాడే" అని తెలిపారు కలామ్​చౌరా వాసి ఇలియుస్ హుస్సేన్.

"సరిహద్దుల్లో కంచె వేసినా సోనమురా సబ్​ డివిజన్​లో అక్కడక్కడ ఖాళీలు ఉన్నాయి. కలామ్​చౌరా గ్రామ పంచాయతీ పరిధిలో అయితే కొన్ని ఇళ్ల మధ్యలో నుంచి సరిహద్దు గీత వెళ్తుంది. మరికొన్ని చోట్ల ఉపరితల సంక్లిష్టతల కారణంగా కంచె వేయడం కుదరలేదు. అందుకే ఈ పరిస్థితి" అని బీఎస్​ఎఫ్​ వర్గాలు వివరించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.