ETV Bharat / bharat

నోటితో బాటిల్​ మూత ఓపెన్​.. బాలుడు మృతి! - అంబాలా వార్త

Boy Chokes to Death: నోటితో బాటిల్​ మూత తీసేందుకు యత్నించగా.. గొంతులో క్యాప్​ ఇరుక్కొని బాలుడు మృతి చెందిన సంఘటన హరియాణా​లోని అంబాలాలో జరిగింది.

BOTTLE CAP
నోటితో బాటిల్​ క్యాప్​ తీసే యత్నం
author img

By

Published : May 21, 2022, 3:34 PM IST

Boy Chokes to Death: గొంతులో బాటిల్​ మూత ఇరుక్కొని ఊపిరాడక 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన హరియాణాలోని అంబాలాలో వెలుగు చూసింది. బాధితుడు అంబాలా కంటోన్మెంట్​లోని డిఫెన్స్​ కాలనీకి చెందిన యశ్​గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం అతడు ఇంటర్​ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు.

ఇదీ జరిగింది: శుక్రవారం రాత్రి శీతల పానీయం బాటిల్​ మూత తెలిచేందుకు యశ్​ సోదరి ఇబ్బందులు పడింది. దీంతో తాను తీస్తానని చెప్పి నోటితే తెరిచేందుకు ప్రయత్నించాడా బాలుడు​. ఒక్కసారిగా తెరుచుకున్న క్యాప్​.. గొంతులోకి వెళ్లింది. శ్వాసనాళానికి అడ్డుపడటం వల్ల ఊపిరాడక యశ్​ ఇబ్బంది పడ్డాడు. మూతను గొంతులోంచి తీసేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్​మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.

ఇదీ చూడండి: చనిపోయిన వ్యక్తిని పెళ్లాడిన వితంతువు!

ఒకే పోలికతో 'ట్విన్స్​​'.. 6 నెలలుగా అన్న భార్యపై అత్యాచారం.. పాపం ఆమెకు తెలిసేలోపే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.