Free Bus Service in Delhi: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీలో మహిళలకు బస్సు ప్రయాణాన్ని ఉచితం చేశారు. కానీ పురుషులకు ఈ ఆఫర్ లేదు. బస్సులో ఎలాగైనా ఉచితంగా ప్రయాణించాలనుకున్న ఓ యువకుడు లేడీ గెటప్‌తో బస్సు ఎక్కాడు. స్కార్ఫ్, మాస్కుతో మేనేజ్ చేద్దామని అనుకున్నాడు. కానీ కండక్టరుకు అనుమానం రావడం వల్ల అసలు విషయం బయటపడింది.
మాస్కును తీసేందుకు మొదట నిరాకరించిన యువకుడు కండక్టర్‌ను క్షమాపణలు కోరాడు. అయితే కండక్టర్ అతనిపై సీరియస్ అవడం వల్ల చివరకు మాస్కును తొలగించాడు. అయితే దొరికిపోయాక కూడా అమ్మాయి గొంతుతోనే అతను మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కండక్టర్ తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది.
ఇదీ చూడండి : 'వివాహం అంటే.. భార్యపై లైంగిక వేధింపులకు లైసెన్స్ పొందడం కాదు'