ETV Bharat / bharat

ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ చిన్నారి- 15 అడుగుల లోతులో..

author img

By

Published : Dec 16, 2021, 8:10 PM IST

Borewell Baby Rescue Operation: మధ్యప్రదేశ్​లోని ఛత్తర్​పుర్​ జిల్లా దౌనీ గ్రామంలో ఓ ఏడాదిన్నర చిన్నారి బోరుబావిలో చిక్కుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

d
d
బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి

Borewell Baby Rescue Operation: పొలంలో ఆడుకుంటున్న ఓ చిన్నారి అకస్మాత్తుగా అక్కడే ఉన్న ఓ బోరుబావిలో పడిపోయింది. బోరులో చిక్కుకున్న ఈ చిన్నారిని వెలికితీసేందుకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని ఛత్తర్​పుర్​ జిల్లా దౌనీ అనే గ్రామంలో జరిగింది.

ఇదీ జరిగింది..

ఏడాదిన్నర వయసు గల దివ్యాన్షి పొలంలో ఆడుకుంటుండగా అక్కడే తెరిచి ఉన్న ఓ బోరు బావిలోకి జారి పడింది. చిన్నారి ఏడుపు విని అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు ఆమెను వెలికితీసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడం వల్ల అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

చిన్నారి జారి పడిన ఈ బోరు ఎండిపోయి చాలా కాలం అయిందని.. దీని లోతు 15 అడుగులు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దివ్యాన్షి సురక్షితంగానే ఉందని.. వీలైనంత త్వరగా ఆమెను వెలికి తీస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : అదనుచూసి లేడిని వేటాడిన చిరుత- వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.