ETV Bharat / bharat

దుస్తులపై తాకితే రేప్​ కాదన్న జడ్జి రాజీనామా! - పుష్ప గనేడివాలా

Justice Pushpa Ganediwala: దుస్తులపైనుంచి తాకితే లైంగిక వేధింపులుగా భావించలేమంటూ వివాదాస్పద తీర్పు వెలువరించిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్​ పుష్ప గనేడివాలా రాజీనామా చేశారు. అదనపు జడ్జిగా పదవీకాలం ముగిసే ఒక్క రోజు ముందే రాజీనామా చేయటం గమనార్హం.

bombay high court judge pushpa ganediwala
బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్​ పుష్ప గనేడివాలా
author img

By

Published : Feb 11, 2022, 2:20 PM IST

Updated : Feb 12, 2022, 9:53 AM IST

Justice Pushpa Ganediwala: లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇచ్చి.. సంచలనంగా మారిన బాంబే హైకోర్టు మహిళా న్యాయముర్తి జస్టిస్​ పుష్ప గనేడివాలా రాజీనామా చేశారు. తన పదవీ కాలం ముగిసే ఒక్క రోజు ముందే ఆమె రాజీనామా చేయటం గమనార్హం. అదనపు న్యాయమూర్తిగా ఆమె పదవీకాలం ఫిబ్రవరి 12తో ముగియనుంది.

ప్రస్తుతం జస్టిస్​ గనేడివాలా.. బాంబే హైకోర్టులోని నాగ్​పుర్​ బెంచ్​లో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021, జనవరి, ఫిబ్రవరిలో లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇచ్చిన క్రమంలో పూర్తిస్థాయిలో న్యాయమూర్తి హోదా కల్పించాలనే ప్రతిపాదనను సుప్రీం కోర్టు కొలీజియం వెనక్కి తీసుకుంది. ఆమె అదనపు న్యాయమూర్తిగా పదవీ కాలాన్ని పొడగించటం, పూర్తిస్థాయి హోదా కల్పించటం వంటి వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఆమె డిమోట్​ అయ్యి.. 2022, ఫిబ్రవరి 12 నుంచి జిల్లా సెషన్స్​ జడ్జిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఆమె రాజీనామా చేసినట్లు హైకోర్టు వర్గాలు తెలిపాయి. ఆమె రాజీనామాకు ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వివాదాస్పద తీర్పులు..

12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తడమగా, చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్‌ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం వేధింపులుగా పేర్కొనలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.

ఆ తర్వాత అయిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ జస్టిస్‌ పుష్ప ఇలాంటి తీర్పునే ఇచ్చారు. మైనర్‌ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్‌ విప్పుకోవడం లైంగిక వేధింపుల కిందికి రాదని తీర్పు వెలువరించారు. వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. అయితే ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి.

ఇదీ చూడండి: వివాదాస్పద తీర్పులు.. న్యాయమూర్తికి సుప్రీం షాక్‌!

Last Updated : Feb 12, 2022, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.