ETV Bharat / bharat

ప్రొఫెసర్​ సాయిబాబాకు ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు - delhi university Professor Saibaba

దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్​ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టైన ఎనిమిదేళ్ల తర్వాత.. సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తక్షణమే సాయిబాబాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులో చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా) నిబంధనలు చెల్లవని ధర్మాసనం స్పష్టం చేసింది. వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన 52 ఏళ్ల సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

Delhi University professor G N Saibaba
Delhi University professor G N Saibaba
author img

By

Published : Oct 14, 2022, 11:19 AM IST

Updated : Oct 14, 2022, 5:33 PM IST

Professor Saibaba : దిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ జీఎన్​ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబా నిర్దోషని.. ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. తనకు జీవిత ఖైదు విధిస్తూ 2017లో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సాయిబాబా బాంబే హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిని విచారించిన జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్‌ అనిల్ పన్సారేలతో కూడిన ధర్మాసనం.. సాయిబాబా నిర్దోషని తీర్పునిచ్చింది. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. ఈ ఐదుగురిలో ఒకరు.. అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. వీళ్లంతా వేరే కేసులో లేకుంటే వాళ్లను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

సుప్రీంను ఆశ్రయించిన ఎన్​ఐఏ
మరోవైపు మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్​ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఎన్​ఐఏ ఈ నిర్ణయం తీసుకుంది.

దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2017 మార్చిలో ఉపా చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మావోయిస్టు సంబంధాలతో దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే కార్యకలాపాలకు వీరు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ఉపాతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద సాయిబాబా, ఇతరులను కోర్టు దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. సాయిబాబాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో ఉంచారు. మొదట అరెస్టయిన ఐదుగురు నిందితులపై 2014లో, సాయిబాబాపై 2015లో ఉపా కింద విచారించేందుకు అనుమతి లభించింది.

2013 ఆగస్ట్ 22న గడ్చిరోలి జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పట్టుబడిన వారి.. సమాచారం ఆధారంగా పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. 2013 సెప్టెంబరు 7న సాయిబాబా ఇంట్లో సోదాలు చేసేందుకు కోర్టు వారెంట్‌ జారీ చేసింది. సెప్టెంబర్ 9న పోలీసులు సోదాలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరి 16న కోర్టు ముందు పోలీసులు ఛార్జ్‌ షీట్‌ ఉంచారు. 2014 మే 9న సాయిబాబాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. 2015 ఏప్రిల్‌ 6న ఉపా కింద సాయిబాబాను విచారించడానికి కోర్టు అనుమతిని ఇచ్చింది.

మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు 2017 మార్చి 3న ఉపా ఐపీసీలోని సెక్షన్ల కింద సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. సాయిబాబా మరో నలుగురికి జీవిత ఖైదు ఒకరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2017 మార్చి 29న బాంబే హైకోర్టులో నేరారోపణలను అప్పీల్ చేశారు. 2022 అక్టోబర్‌ 14న సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

వైద్య పరిభాషలో సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు సాయిబాబాకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయిబాబాపై మోపిన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపాను రద్దు చేయాలని గతంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా పలు పార్టీల నేతలు మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు డిమాండ్ చేశారు. తాజాగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ సాయిబాబాను విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వామపక్షాలు, ప్రజా సంఘాలు స్వాగతించాయి.

Last Updated : Oct 14, 2022, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.