ETV Bharat / bharat

పండగల వేళ బాంబుదాడులు.. హరిద్వార్, రిషికేశ్​లకు 'జైషే మహ్మద్' బెదిరింపులు - ఉత్తరాఖండ్ లేటెస్ట్ న్యూస్

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని రైల్వే పోలీసులకు అందిన ఓ లేఖ కలకలం రేపుతోంది. అక్టోబరు 25, 27 తేదీల్లో హరిద్వార్​, రిషికేశ్​, చార్​ధామ్​లో బాంబు పేలుళ్లకు పాల్పడతామని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ హెచ్చరించింది.

bomb blast threat in Haridwar
బాంబు పేలుళ్ల బెదిరింపులు
author img

By

Published : Oct 15, 2022, 5:56 PM IST

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అక్టోబరు 25, 27 తేదీల్లో హరిద్వార్​, రిషికేశ్​లలో బాంబు దాడులకు పాల్పడతామని జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థ లేఖ రాసింది. హరిద్వార్ రైల్వే పోలీసులకు ఈ లేఖ పంపింది. అక్టోబర్ 10న వచ్చిన బెదిరింపు లేఖను పోలీసు శాఖ గోప్యంగా ఉంచగా.. హరిద్వార్ రైల్వే పోలీసులు లేఖ పంపిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక సిట్​ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గత పదేళ్లుగా బాంబు పేలుళ్లకు సంబంధించిన లేఖలు హరిద్వార్​ రైల్వే పోలీసులకు వస్తున్నాయి. అయితే పండగ సమయంలో ఇలా ఎప్పుడూ బెదిరింపు లేఖలు రాలేదు. అక్టోబర్ 25న హరిద్వార్, రిషికేశ్.. అక్టోబర్ 27న చార్​ధామ్​లో బాంబు పేలుళ్లు జరుపుతామని ఉగ్రసంస్థ జైషే మహ్మద్​ లేఖలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు హరిద్వార్, రిషికేశ్​, చార్​ధామ్​లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. దీంతో పాటు హరిద్వార్ రైల్వే స్టేషన్ ఆవరణలో భద్రతను మరింత పెంచారు.

ఇవీ చదవండి: నదిలో వెళ్తుండగా సీఎంకు ప్రమాదం.. పిల్లర్​ను ఢీకొట్టిన బోటు.. స్వల్ప గాయాలు

తల్లీబిడ్డలను వేరు చేసిన జర్మనీ ప్రభుత్వం.. దిల్లీలో బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.