ETV Bharat / bharat

మస్కిటో కాయిల్​ వల్ల ఆరుగురు మృతి.. పెళ్లికి వెళ్లి వస్తూ మరో ఏడుగురు.. - కెనాల్​లో పడిన పెళ్లి వాహనం ఒడిశా

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, మస్కిటో కాయిల్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

bolero accident odisha
bolero accident odisha
author img

By

Published : Mar 31, 2023, 9:40 AM IST

Updated : Mar 31, 2023, 12:31 PM IST

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమంయంలో వాహనంలో 11 మంది ఉన్నారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను అజిత్ ఖమారి, దివ్య లోహా, సుబల్ భోయ్, సుమంత్ భోయ్, సరోజ్ సేథ్, రమాకాంత్ భోయ్, బొలెరో డ్రైవర్ శతృఘ్న భోయ్‌గా గుర్తించారు. ఈ ఘటన సంబల్​పుర్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్సుగూడ జిల్లాలోని లఖన్​పుర్​ పరిధిలోని బదాధార గ్రామానికి చెందిన 11 మంది.. సంబల్​పుర్​లోని పరమన్​పుర్​లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు. వివాహా వేడుక శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు బొలెరో వాహనంలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. సంబల్​పుర్ జిల్లా ససన్​ కాలువ​ వద్దకు రాగానే.. వాహనం అదుపుతప్పి ఆ కెనాల్​లో పడిపోయింది. ఆ సమయంలో నలుగురు బయటపడగా.. మిగతా ఏడుగురు బయటకు రాలేక ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను సంబల్​పుర్​ ఆస్పత్రికి తరలించారు. అయితే వాహనం కెనాల్​లో పడిన తర్వాత చాలా సేపటి వరకు ఎవరూ సహాయం చేయలేదని.. అంబులెన్స్​ ఆక్సిజన్​కు ఫోన్​చేసినా.. స్పందించలేదని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్​!
దిల్లీలో దారుణం జరిగింది. మస్కిటో కాయిల్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన శాస్త్రి పార్క్​ సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మూడు ఫైర్​ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఆ ఇంట్లో వ్యక్తులు నిద్రపోతున్న సమయంలో.. మస్కిటో కాయిల్​ పరుపునకు అంటుకుని మంటలు వ్యాపించాయని.. దాంతో ఊపిరి ఆడక మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య..
కర్ణాటకలో హృదయ విదారక ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మంగళూరులో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరులో సమీపంలోని విజయనగర్​కు చెందిన దేవేంద్ర(48).. తన భార్య, 9 ఏళ్ల కవల కుమార్తెలతో మంగళూరుకు వచ్చాడు. అనంతరం ఓ లాడ్జ్​లో మూడు రోజుల ఉన్నారు. ఆ సమయంలో తన భార్యకు, ఇద్దరు కుమార్తెలకు విషం తాగించి.. తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శుక్రవారం లాడ్జ్​ సిబ్బంది వెళ్లినప్పుడు తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జ్​ సిబ్బంది.. లోపలికి వెళ్లి చూస్తే దేవేంద్ర మృతదేహం వేళాడుతూ.. మిగతా వాళ్లు కింద పడి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఓ సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అప్పుల బాధతో చనిపోతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Mar 31, 2023, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.