ETV Bharat / bharat

Boat Accident In Bihar : విద్యార్థుల పడవ బోల్తా.. 10 మంది చిన్నారులు గల్లంతు.. మరో 20 మంది..

Boat Accident In Bihar : బిహార్‌ ముజఫర్‌పుర్‌ జిల్లాలోని భాగమతి నదిలో బోల్తా పడి 10 మంది చిన్నారులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నారు. పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులు పడవలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Boat Accident In Bihar
Boat Accident In Bihar
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 1:52 PM IST

Updated : Sep 14, 2023, 3:17 PM IST

Boat Accident In Bihar : బిహార్‌ ముజఫర్‌పుర్‌ జిల్లాలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడడం వల్ల 10 మంది చిన్నారులు గల్లంతయ్యారు. గురువారం ఉదయం మధురపట్టి ఘాట్​ సమీపంలోని భాగమతి నదిలో బోల్తా పడింది. పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులు పడవలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ దుర్ఘటన గురించి తెలియగానే స్థానికులు నాటు పడవలతో సహాయక చర్యలు చేపట్టి 20 మంది చిన్నారులను ఒడ్డుకు చేర్చారు. విద్యార్థుల్లో కొందరికి ఈత రావడం వల్ల ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి గల్లంతైన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన చిన్నారులు గల్లంతు కావడం వల్ల అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

  • #WATCH | A team of NDRF conducts search and rescue operation at the site of a boat capsize in Bihar's Muzaffarpur

    10 persons remain missing, 15-20 people rescued so far, as per district administration. pic.twitter.com/9d2hSqASIH

    — ANI (@ANI) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పరిమితికి మించి ప్రయాణికులే కారణం!
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. డబ్బుకు ఆశపడి ఎక్కువ మంది విద్యార్థులను ఒకే పడవలో ఎక్కించున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు అధిక వర్షాలు, నేపాల్​లో నుంచి నది ప్రవాహం ఎక్కువ కావడం వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ
మరోవైపు ముజఫర్‌పుర్‌ పర్యటనలోనే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌.. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

టెంపో-ట్రక్కు ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్​
Maharashtra Road Accident : మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. సతారా జిల్లాలోని పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును టెంపో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో యజమాని, డ్రైవర్, క్లీనర్​ అక్కడిక్కడే మృతిచెందారు. వీరంతా బెలగాం జిల్లాకు చెందిన మంజునాథ్​ యెల్లప్ప, ఆనందర్​ గురుసిద్ధ్, సత్యప్ప నాయకర్​గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టెంపో.. ట్రక్కు ఇరుక్కుపోవడం వల్ల జేసీబీ సహాయంతో బయటకు తీశారు.

Car Accident Viral Video : అతివేగంతో వృద్ధుడిపైకి దూసుకెళ్లిన కారు.. లారీ కింద పడి యువ దంపతులు మృతి

Rajasthan Road Accident Today : ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11 మంది భక్తులు మృతి.. మరో 15 మంది..

Last Updated : Sep 14, 2023, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.