ETV Bharat / bharat

ఎమ్మెల్యే​ అభ్యర్థి ఇంట్లో చేతబడి! - కేరళలో చేతబడి ఎన్నికలు

కేరళలోని కొల్లాం జిల్లా యూడీఎఫ్​ అభ్యర్థి ఉల్లాస్ కొవుర్​ నివాసంలో అనుమానాస్పద రీతిలో గుడ్లు, నిమ్మకాయ లభించాయి. ఇది ప్రత్యర్థుల పనేనని.. ఉల్లాస్​పై చేతబడి చేసినట్లు యూడీఎఫ్​ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

kerala black magic, black magic in udf candidate kerala
యూడీఎఫ్​ అభ్యర్థి ఇంట్లో చేతబడి
author img

By

Published : Apr 5, 2021, 8:12 PM IST

కేరళలోని కొల్లాం జిల్లా కున్నథూర్​లోని యూడీఎఫ్​​ అభ్యర్థి ఉల్లాస్​ కొవుర్​ ఇంట్లో గుడ్లు, నిమ్మకాయ ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఉల్లాస్​ పెరడులోని మామాడి చెట్టు కింద ఓ అరిటాకు మీద రెండు గుడ్లు, నిమ్మకాయ ఉండటం పార్టీ కార్యకర్తలు గుర్తించారు. గుడ్డుకు ఉన్న ఎర్రటి దారానికి ఓ వైపు శత్రువు అని, మరోవైపు ఓం అని రాసున్నాయి. ఇది ఉల్లాస్​పై ప్రత్యర్థులు చేస్తున్న చేతబడి వారు ఆరోపిస్తున్నారు.

kerala black magic, black magic in udf candidate kerala
ఉల్లాస్​ నివాసం వద్ద లభించిన గుడ్లు, నిమ్మకాయ

అదేం లేదు..

అయితే పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలను ఉల్లాస్​ కొట్టిపారేశారు. ఇదంతా ఎవరో ఆకతాయిలు తనను కలవరపెట్టేందుకు చేసుంటారని అన్నారు. ఇది రాజకీయ ప్రత్యర్థులు చేసుంటారని తాను భావించట్లేదని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : 'ఒంటికాలుతో బంగాల్​లో విజయం-​ రెండు కాళ్లతో దిల్లీపై గురి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.