రాజస్థాన్లో మహమ్మారుల జాబితాలో బ్లాక్ ఫంగస్ (మ్యూకర్మైకోసిస్)ను చేరుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ అంటువ్యాధుల చట్టం- 2020 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో 100మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. వారిని జైపూర్లోని సవాయి మన్సింగ్ ఆసుపత్రిలో చేర్చారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరోనా నుంచి కోలుకున్న కొందరికి ఈ వ్యాధి సోకుతోందని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని తెలిపింది.
ఇదీ చదవండి: అందుబాటులోకి బ్లాక్ ఫంగస్ వ్యతిరేక ఔషధం