Uttarakhand CM: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం.. దెహ్రాదూన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు ధామీ. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సహా భాజపా నేతలు యోగి ఆదిత్యనాథ్, ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.
ఉత్తరాఖండ్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ధామీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖటిమా నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అయినా భాజపా నేతలు.. పార్టీ విజయానికి ధామీనే కారణమని పేర్కొంటూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి రేసులో పుష్కర్ సింగ్ సహా ఎమ్మెల్యేలు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలుని, కేంద్ర మాజీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ చివరకు ధామీకే జై కొట్టారు ఎమ్మెల్యేలు.
ఇదీ చూడండి : 45ఏళ్ల భర్తను వదిలి.. 22ఏళ్ల ప్రేమికుడితో వెళ్లి.. 25సిమ్‌లు మార్చి..