ETV Bharat / bharat

కేంద్రమంత్రిని కలిసేందుకు వెళ్లిన మహిళలపై భాజపా కార్యకర్తల దాడి! - మహిళలపై భాజపా కార్యకర్తల దాడి

ఉత్తర్​ప్రదేశ్ జైస​లో.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసి తమ ప్రాంతంలో ఉన్న నీటి సమస్యలను వివరించేందుకు వెళ్లిన మహిళలపై దాడి జరిగింది. భాజపా కార్యకర్తలు, జైస మున్సిపల్​ అధ్యక్షుడు, ఆయన తనయుడు తమపై దాడి చేశారని మహిళలు ఆరోపించారు.

women beaten by bjp workers
స్మృతి ఇరానీని కలిసేందుకు వెళ్లిన మహిళలపై భాజపా కార్యకర్తల దాడి!
author img

By

Published : Dec 25, 2021, 8:09 AM IST

మహిళలపై భాజపా కార్యకర్తల దాడి!

ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీలోని జైస​లో.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసేందుకు వెళ్లిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. భాజపా కార్యకర్తలు, జైస​ మున్సిపల్​ అధ్యక్షుడు, ఆయన తనయుడు.. ఆ మహిళలపై దాడి చేశారు.

అమేఠీలోని జైస్​లో శుక్రవారం పర్యటించిన ఇరానీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అయితే ఆమె పర్యటనకు కొద్ది గంటల ముందు కొందరు మహిళలు అక్కడికి వెళ్లారు. ఇరానీతో మాట్లాడి.. వారి కష్టాలను చెప్పుకోవాలని ఎదురుచూశారు. ఇంతలో జైస​ మున్సిపల్​ అధ్యక్షుడు మహేశ్​ శొంకర్​, ఆయన తనయుడు భాను శొంకర్​లు ఘటనాస్థలానికి వెళ్లి వారిని కొట్టినట్టు తెలుస్తోంది.

women beaten by bjp workers
జైసలో
women beaten by bjp workers
జైసలో ఉద్రిక్త వాతావరణం

"మేము ఎన్నో ఏళ్లుగా జైసలోనే ఉంటున్నాము. మా ప్రాంతంలో నీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. బకెట్లతో నీరు నింపుకోవాల్సి వస్తేంది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రికి వివరించాలని వెళ్లాము. ఇంతలో తండ్రీకొడుకులు మా మీద దాడి చేశారు. నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లారు," అని ఓ మహిళ మీడియాకు వివరించింది.

women beaten by bjp workers
ఘటనలో గాయపడ్డ మహిళ

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

ఇదీ చూడండి:- 'ధర్మ సంసద్'​లో విద్వేష ప్రసంగం- రాహుల్​, ప్రియాంక ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.