ETV Bharat / bharat

దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా భాజపా: పీకే - భాజపాపై ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు

దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కొన్ని దశాబ్దాలపాటు కేంద్ర బిందువుగా ఉంటుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుర్తించకపోవటమే అసలు సమస్య అని అన్నారు.

KISHOR
ప్రశాంత్ కిశోర్
author img

By

Published : Oct 28, 2021, 6:29 PM IST

రాబోయే కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో భాజపా కేంద్ర బిందువుగా ఉంటుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు భాజపాను తక్షణమే తరిమికొడతారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భావిస్తున్నారని.. కానీ అది ఇప్పట్లో జరగదని జోస్యం చెప్పారు. ఈ మేరకు గోవాలో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో 'పీకే' ప్రసంగించిన వీడియో వైరల్‌గా మారింది. 'ఒకవేళ కేంద్రంలో మోదీ దిగిపోయినప్పటికీ భాజపా ఎక్కడికీ వెళ్లదు. రాబోయే దశాబ్దాల్లో ఆ పార్టీతో కాంగ్రెస్ పోరాడాల్సిందే' అని ఆయన అభిప్రాయపడ్డారు.

రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోసం ప్రస్తుతం వ్యూహాలు రచిస్తున్నారు పీకే.

"భారత రాజకీయాల్లో భాజపా కేంద్ర బిందువుగా మారబోతోంది. గెలిచినా, ఓడినా స్వాతంత్య్రం వచ్చిన తొలి 40 ఏళ్లలో కాంగ్రెస్‌ ఎలాగైతే ఉందో.. భాజపా సైతం ఎక్కడికీ వెళ్లదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 30 శాతానికి పైగా ఓట్లు సాధించినప్పటికీ.. మోదీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నందువల్ల, భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించుతారని భావించొద్దు."

-ప్రశాంత్ కిషోర్, రాజకీయ వ్యూహకర్త

తన ప్రసంగంలో రాహుల్ గాంధీని ప్రస్తావించారు కిశోర్. 'ప్రజలు మోదీని గద్దె దించుతారని భావిస్తారని రాహుల్ అనుకుంటారు. అదే అసలు సమస్య' అని వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది బంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకే పార్టీలకు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు రూపొందించగా.. ఆ పార్టీలు ఘన విజయం సాధించాయి.

కొత్త విషయమేమీ కాదుగా!

ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యలపై భాజపా స్పందించింది. రాజకీయాలను అతీతంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఉద్ఘాటించింది. 'ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలతో దేశం మొత్తం ఏకీభవిస్తోంది. ప్రజలందరికీ తెలిసిన విషయాలనే ఆయన చెప్పారు' అని భాజపా అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.