ETV Bharat / bharat

లత కన్నుమూత.. మోదీ, భాజపా కార్యక్రమాలు రద్దు

BJP UP manifesto release postpones: గాయని లతా మంగేష్కర్ మరణించిన నేపథ్యంలో.. భాజపా తన రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల కోసం రూపొందించిన మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసుకుంది. గోవాలో మోదీ పాల్గొనాల్సిన వర్చువల్ సభ సైతం రద్దైంది.

bjp-up-manifesto-release-postpones
లతా మంగేష్కర్ మృతి
author img

By

Published : Feb 6, 2022, 1:22 PM IST

BJP UP manifesto release postponed: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సహా మోదీ పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసింది.

BJP UP manifesto Lata Mangeshkar:

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల కోసం ఆదివారం ఉదయం 10.15 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయాలని ముందుగా నిశ్చయించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇందుకోసం.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, గాయని మృతి నేపథ్యంలో విడుదలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్​ప్రదేశ్ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గాయని ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Goa PM Modi virtual program

అటు, గోవాలో ప్రధాని వర్చువల్ ప్రచారం రద్దైంది. మోదీ ర్యాలీతో పాటు ఇతర కార్యక్రమాలను సైతం నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. లతా మంగేష్కర్ మరణించిన నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంతాప దినాలను పాటించనున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోను సైతం విడుదల చేయడం లేదన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం కూడా రద్దైందని చెప్పారు.

గాయని కన్నుమూత..

కరోనా బారినపడి కోలుకున్న లతా మంగేష్కర్.. ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొవిడ్​ అనంతరం 28 రోజుల పాటు ఆమె చికిత్స తీసుకున్నారని... పలు అవయవాలు దెబ్బతినటం వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి తన ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి: లతా మంగేష్కర్​ పాటల పూదోటలో అద్భుతాలెన్నో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.