ETV Bharat / bharat

కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్​' పైనే!

తరతరాలుగా కేరళను పాలిస్తోన్న వామపక్షాలకు పోటీగా భాజపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తన బలాన్ని నెమ్మదిగా పెంచుకునేందుకు యత్నిస్తోంది. ఇందుకోసం మెట్రోమ్యాన్​ ఇమేజ్​ను ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. మరి ఎర్రజెండా రెపరెపలాడే కేరళలో కాషాయం ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Bjp trying to cash in on 'Metro man' Sreedharan's image
కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్​'పైనే!
author img

By

Published : Feb 20, 2021, 2:27 PM IST

Updated : Feb 20, 2021, 2:43 PM IST

140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం ఒక్కటంటే ఒక్కటే. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరిచింది. వామపక్షాల ఇలాకాలో భాజపా పరిస్థితేంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది మార్చేందుకే కాషాయ పార్టీ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులను ఇందుకు ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలోనే 'మెట్రోమ్యాన్​'గా పిలిచే శ్రీధరన్​ను పార్టీలోకి ఆహ్వానించింది.

ఇదీ చదవండి: కేరళలో ఇప్పుడైనా భాజపా పుంజుకుంటుందా?

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ తలపెట్టిన విజయ యాత్రలో భాగంగా.. ఈ.శ్రీధరన్​కు పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు పార్టీ ప్రకటించింది. త్రిస్సూర్ లేదా ఎర్నాకులం నుంచి ఆయన్ను బరిలోకి దించాలని భావిస్తోంది. తద్వారా మెట్రోమ్యాన్​ ఇమేజ్​ను ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలని అనుకుంటోంది భాజపా. అభివృద్ధి విషయాల్లో ఆయనకు ఉన్న మంచిపేరు పార్టీకి లాభిస్తుందని విశ్వసిస్తోంది.

ఇదీ చదవండి: 'భాజపా అధికారంలోకి వస్తే సీఎం పదవికి సై'

గత లోక్​సభ ఎన్నికల సమయంలోనే మెట్రోమ్యాన్​ భాజపాలో చేరతారంటూ పుకార్లు వచ్చాయి. పార్టీ నేతలు సైతం ఆయనతో చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అప్పుడు వీటిపై శ్రీధరన్ స్పందించలేదు. తాజాగా భాజపా జాతీయ స్థాయి నేతలు శ్రీధరన్​తో మరోసారి చర్చించి, ఆయన అభిప్రాయాన్ని కోరారు. ఈ సమావేశంలోనే మెట్రోమ్యాన్ భాజపాలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఎన్నికల వేడి మొదలవ్వక ముందే పార్టీలోకి ఆదరణ కలిగిన వ్యక్తులను ఆహ్వానించాలని అధిష్ఠానం నుంచి రాష్ట్ర నేతలకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరికొందరు ప్రముఖులు సైతం భాజపాకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరందరికీ 'విజయ యాత్ర'లోనే పార్టీ సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

Last Updated : Feb 20, 2021, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.