ETV Bharat / bharat

'సోనియా, మమత క్షమాపణలు చెప్పాలి' - బాట్లా హౌస్ రవిశంకర్​ ప్రసాద్

బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​పై అనుమానాలు వ్యక్తంచేసిన విపక్షాలు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. జాతీయ భద్రత అంశంలో ఆ పార్టీలు ఉగ్రవాదుల పక్షాన నిలిచాయని ఆయన విమర్శించారు.

BJP targets Congress, Mamata after Batla House conviction
'సోనియా, మమత క్షమాపణలు చెప్పాలి'
author img

By

Published : Mar 9, 2021, 5:45 PM IST

2008 బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​పై అనుమానాలు లేవలెత్తిన విపక్షాలపై ధ్వజమెత్తారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్. పోలీసు, న్యాయ వ్యవస్థలపై అపనమ్మకం ఉంచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీ పోలీసులను అప్రతిష్ఠ పాలు చేయడానికి ఆయా పార్టీలు చేసిన ప్రచారం వారి మానసిక స్థైర్యంపై ఎంత మేర ప్రభావం చూపిందో అంచనా వేయడానికి ఓ కమిటీ వేయాలన్నారు.

"బాట్లా హౌస్ ఎన్​కౌంటర్​ ప్రామాణికతపై దిల్లీ పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు తీవ్ర కుట్ర జరుగుతోంది. తద్వారా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా దేనికోసం? ఇది ముమ్మాటికీ ఓటు బ్యాంకు రాజకీయం."

-రవిశంకర్​ ప్రసాద్, కేంద్ర మంత్రి

2008 సెప్టెంబర్ 13న దిల్లీలో ఐదు వరుస బాంబు దాడులు జరిగాయి. ఆ తర్వాత వారానికి జరిగిన ఎన్​కౌంటర్​లో దిల్లీ ప్రత్యేక పోలీసు అధికారి ఎంసీ శర్మ చనిపోయారు. అయితే ఎన్​కౌంటర్లను నిరసిస్తూ నాడు పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.

క్షమాపణ చెప్పాలి..

ఈ వ్యవహారంలో దిల్లీ పోలీసుల పాత్రపై నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. అవి బూటకపు ఎన్​కౌంటర్లని, తప్పని రుజువైతే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్​ చేశారు. సమాజ్​వాదీ పార్టీ, ఆప్​ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయి. అయితే ఈ కేసులో ఇటీవల ఆరిజ్​ ఖాన్ దోషిగా​ తేలినందున ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలన్నారు రవిశంకర్ ప్రసాద్.

"ఈ పార్టీలు, సోనియా గాంధీ, మమత బెనర్జీ క్షమాపణ చెప్తారా? ఓట్ల కోసం ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అయినా న్యాయమే గెలిచింది. 2014లో భాజపా అధికారంలోకి వచ్చాక దోషులను శిక్షించేందుకు చేసిన యత్నాలపై బురదజల్లారు. జాతీయ భద్రత అంశంలో ప్రతిపక్షాలు ఉగ్రవాదుల పక్షాన నిలిచాయి." అని రవిశంకర్ విమర్శించారు.

ఇదీ చూడండి: అందుకే నందిగ్రామ్​ నుంచి పోటీ: మమత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.