ETV Bharat / bharat

దేశంలో రూ.2వేల నోట్లను దశల వారీగా రద్దు చేయాల్సిందే!: భాజపా ఎంపీ - కరెన్సీ నోట్ల ముద్రణపై సుశీల్ ప్రసంగం

దేశంలో రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాజ్యసభ భాజపా ఎంపీ సుశీల్​ మోదీ. డ్రగ్స్ వంటి అక్రమ వ్యాపారాల్లో రూ.2000 నోట్లను తరచుగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Sushil Modi raises scarcity of Rs 2000 notes in RS

author img

By

Published : Dec 12, 2022, 4:21 PM IST

దేశంలో దశలవారీగా రూ.2000 నోట్లను రద్దు చేయాలని రాజ్యసభ భాజపా ఎంపీ సుశీల్​ మోదీ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న రెండు వేల నోట్లను డిపాజిట్​ చేయడానికి రెండేళ్ల సమయం కూడా ఇవ్వాలని అన్నారు. రాజ్యసభలో సమావేశాల్లో భాగంగా సోమవారం క్వశ్చర్​ అవర్​లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.

దేశంలో చాలా చోట్ల ఏటీఎంలో రూ.2000 నోట్లు రావట్లేదని, అందుకే వాటిని రద్దు చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయని తెలిపారు. ఆ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల క్రితమే రిజర్వ్​ బ్యాంక్​ నోట్ల ముద్రణ నిలిపివేసిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రూ.2000 నోట్లు లేకపోయినా అభివృద్ధి చెందిన దేశాలను ఆయన ఉదాహరించారు. డ్రగ్స్ వంటి అక్రమ వ్యాపారాల్లో రూ.2000 నోట్లను తరచుగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

పెద్దనోట్ల రద్దు.. భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపునకు గురిచేసిన నిర్ణయం. 2016 నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన సంచలన ప్రకటనతో.. అటు సామాన్యులతో పాటు.. ఇటు రాజకీయ నేతలూ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.